తండాల అభివృద్ధికే కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు

మన తెలంగాణ/చేగుంట : తెలంగాణ ప్రభుత్వం తండాల అభివృద్ధి కోసమే కొత్తగా తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ లింగారెడ్డి తెలిపారు. శనివారం చేగుంట మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సోమ్లా లోక్యా తండాల ప్రజలు అన్ని పార్టీలు వీడి ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ […]

మన తెలంగాణ/చేగుంట : తెలంగాణ ప్రభుత్వం తండాల అభివృద్ధి కోసమే కొత్తగా తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ లింగారెడ్డి తెలిపారు. శనివారం చేగుంట మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సోమ్లా లోక్యా తండాల ప్రజలు అన్ని పార్టీలు వీడి ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విదంగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మాట నిలబెట్టుకుందని తెలిపారు. రాష్టంలోనే అతిచిన్న గ్రామ పంచాయతీగా ఈ లోక్యా, సోమ్లా తండా నిలుస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌పై నమ్మ కం ఉంచి మొత్తం రెండు తండాల ప్రజలు అన్ని పార్టీలను వీడి ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై టిఆర్‌ఎస్ పార్టీలో చేరి సిఎం కెసిఆర్ అడుగుజాడల్లో బంగారు తెలంగాణ సాధనకోసం ముందుకు రావడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమ్లా తండాలో సీసీ రోడ్డు ఏర్పాటునకు రూ.5లక్షలు  మంజూరి చేశారు. అదే విధంగా గతంలో రాంపూర్ గ్రామానికి 25 డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరి చేశామని, వాటిని కట్టడం ప్రారంభించిన తరువాత మరో 40 ఇం డ్లు మంజూరి చేస్తానని తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పార్టీలోకి గ్రామానికి చెందిన బిఖ్యా ఆధ్వర్యంలో సుమారు 150 మందిని టిఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్టీ కండువాలు కప్పి టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లిరమ, మండలపార్టి అధ్యక్షులు వెంగళ్‌రావు, ఇబ్రహింపూర్ సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి, గ్రామ సర్పంచ్ తానీష, సర్పంచ్‌లు వలియానాయక్, జగన్‌గౌడ్, రాంచంద్రం, జనార్ధన్‌రెడ్డి, నగేశ్, మెదక్ జిల్లా రైతు సంఘ సభ్యులు మోహన్‌రెడ్డి, నాయకులు ఎం.శ్రీనివాస్, సాయి, సుదర్శనం, లచ్చగౌడ్, గన్య, అంజాగౌడ్, ఎంపీటీసి రాములు, శ్రీను, మల్లేశం, సిద్దిరాములు, గ్రామ ప్రజలు, తండా వాసులు పాల్గొన్నారు.

Related Stories: