ఢిల్లీలో మహిళల అక్రమ రవాణా

39 మంది నేపాలీ అమ్మాయిలను కాపాడిన డిసిడబ్లు న్యూఢిల్లీ: ఇక్కడి పహర్‌గంజ్‌లో ఉన్న ఓ హోటల్ నుంచి బుధవారం దాదాపు 39 మంది నేపాలీ అమ్మాయిలను ఢిల్లీ మహిళా కమిషన్ (డిసిడబ్లు), సిటీ పోలీస్ సంయుక్త బృందం కాపాడింది. మహిళల అక్రమ రవాణా నిరోధక ఆపరేషన్ తెల్లవారు జామున 1 గంట నుంచి ఉదయం ఆరుగంటల వరకు కొనసాగినట్లు డిసిడబ్లు తెలిపింది. ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. […]

39 మంది నేపాలీ అమ్మాయిలను కాపాడిన డిసిడబ్లు

న్యూఢిల్లీ: ఇక్కడి పహర్‌గంజ్‌లో ఉన్న ఓ హోటల్ నుంచి బుధవారం దాదాపు 39 మంది నేపాలీ అమ్మాయిలను ఢిల్లీ మహిళా కమిషన్ (డిసిడబ్లు), సిటీ పోలీస్ సంయుక్త బృందం కాపాడింది. మహిళల అక్రమ రవాణా నిరోధక ఆపరేషన్ తెల్లవారు జామున 1 గంట నుంచి ఉదయం ఆరుగంటల వరకు కొనసాగినట్లు డిసిడబ్లు తెలిపింది. ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం డిసిడబ్లుకు అందగానే పహార్‌గంజ్‌లోని హోటల్ హృదయ్ ఇన్ నుంచి 39 మంది నేపాలీ అమ్మాయిలను రక్షించాం. హోటల్‌పై దాడి రాత్రంతా కొనసాగింది. ఇందుకు ఢిల్లీ సిటీ పోలీస్ సహకరించింది. ఆ హోటల్‌లో మొత్తం అక్రమ రవాణా కోసం తీసుకొచ్చిన నేపాలీ అమ్మాయిలే ఉన్నారు. వారిని గల్ఫ్ దేశాలకు తరలించేందుకు అక్కడ ఉంచారు. పెద్ద ఎత్తున నడుస్తున్న ఈ అక్రమ రవాణా ముఠాను ఛేదించాం’ అని స్వాతి తన ట్వీట్ దారా తెలిపింది. మహిళల అక్రమ రవాణాపై ఢిల్లీలో జూలై 25 నుంచి జరిగిన ఆపరేషన్‌లలో ఇది మూడోది. జూలై 25న ఢిల్లీలోని మునిర్క ప్రాంతం నుంచి 16 మందిని డిసిడబ్లు కాపాడింది. జూలై 30న ఢిల్లీ, వారణాసి పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార ముఠా నుంచి  16 మంది నేపాలీ మహిళలు సహా మొత్తం 18 మంది మహిళలను రక్షించారు.

Comments

comments

Related Stories: