డ్రోన్ల సాయంతో ఖనిజాల గుర్తింపు

కార్బన్ ఉద్గారాలను తగ్గించుకొని హరిత పర్యావరణ మార్గంలో ముందుకు పోవడానికి వీలుగా జర్మనీ వంటి దేశాలు గాలి మరలు, సౌరఫలకాలు వంటివి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ వీటికి కావలసిన రాగి,కోబాల్టు ప్లాటినం గ్రూపు లోహాలు, ఇండియమ్, జెర్మేనియం వంటి అరుదైన మూలకాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో జర్మనీ శాస్త్రవేత్తలు ఈ విలువైన ఖనిజాలను కనుక్కోవడానికి కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. స్పెషల్ కెమెరాలు, సెన్సార్లుతో కూడిన డ్రోన్లు ఉపయోగించి ఆయా ఖనిజాల శిలల ఉనికిని కనుక్కోగలుగుతున్నారు. […]

కార్బన్ ఉద్గారాలను తగ్గించుకొని హరిత పర్యావరణ మార్గంలో ముందుకు పోవడానికి వీలుగా జర్మనీ వంటి దేశాలు గాలి మరలు, సౌరఫలకాలు వంటివి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ వీటికి కావలసిన రాగి,కోబాల్టు ప్లాటినం గ్రూపు లోహాలు, ఇండియమ్, జెర్మేనియం వంటి అరుదైన మూలకాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో జర్మనీ శాస్త్రవేత్తలు ఈ విలువైన ఖనిజాలను కనుక్కోవడానికి కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. స్పెషల్ కెమెరాలు, సెన్సార్లుతో కూడిన డ్రోన్లు ఉపయోగించి ఆయా ఖనిజాల శిలల ఉనికిని కనుక్కోగలుగుతున్నారు. శిలల్లో దాగి ఒక్కసారి బయటపడే వెలుగుల బట్టి లోహపు ఖనిజాలను గుర్తించ గలుగుతున్నారు. ప్రతి ఖనిజానికి తనదంటూ విశిష్ట లక్షణం గల కాంతి పరావర్తనం ఉంటుంది. దీనికి తోడు శాస్త్రవేత్తలు లాసర్ కిరణాల సెన్సారును అభివృద్ధి చేశారు. ఇది ఆయా ఖనిజాల సహజసిద్ధ కాంతి పరావర్తనాన్ని గ్రహిస్తుంది.
  – సైన్స్ విభాగం

Comments

comments

Related Stories: