డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నలుగురు అరెస్టు

Four arrested in Drunk and Drive

మంగపేట: మండలంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్టు మంగపేట ఎస్‌ఐ చౌళ్ళ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎస్ఐ తెలిపాన వివరాల ప్రకారం… మండలంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న బుచ్చంపేట గ్రామానికి చెందిన పగిడిపల్లి రవి, కొత్తపేటకు చెందిన రేబల్లె నర్సింహారావు, కేమటిపల్లికి చెందిన ఊడుగుల నర్సయ్య, మంగపేట మండల కేంద్రానికి చెందిన రేటె నాగేశ్వరరావులను గుర్తించి అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మద్యం సేవించి వాహనాలను నడిపితే జరిమానాలతో పాటుగా కఠిన చర్యాలు తీసుకుంటామని,  సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించామని తెలిపారు.

Comments

comments