డైట్ లో వెరీస్ట్రిక్ట్

ఇండియన్ క్రికెటర్స్ అంటే అందరికీ క్రేజ్ ఎక్కువే. క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగుతుంటే టివిల ముందు కూచుని  ఆనందంగా వీక్షిస్తూంటారు. సిక్సులు, ఫోర్లు కొడుతుంటే సంతోషానికి హద్దులుండవు. ఆ సమయంలో దృష్టి అంతా క్రికెటర్ల మీదే ఉంటుంది. ఇక వేరే ధ్యాసే ఉండదు. మరి ఆ స్టార్స్ గేమ్ ఆడేందుకు ఏం తింటారు? తీరికవేళల్లో ఏం చేస్తారో చూద్దాం..

Cricketers

విరాట్ కోహ్లి

పరుగుల వీరుడు, చేజింగ్‌లో మొనగాడు విరాట్ కోహ్లి. ప్రస్తుతం విరాట్ డైట్‌లో ఉన్నాడు. కొన్ని సలాడ్స్ మాత్రమే తింటున్నాడు. అందులోనూ ఫిష్, పీతలు లాంటి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాడు.బట్టర్, చీజ్‌కి స్వస్తి చెప్పి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మాత్రమే తింటూ జిమ్‌లో ఎక్కువసేపు గడుపుతున్నాడు. వాటర్ ఎక్కువగా తాగుతూ సాఫ్ట్ డ్రింక్స్ తగ్గించాడు. ఈ మెనూతో విరాట్ మహదానందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు.

రోహిత్ శర్మ

ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఓపెనర్ అయిన రోహిత్‌శర్మ మంచి ఫుడ్ లవర్. కానీ గత కొంతకాలంగా గమనించి నట్లయితే రోహిత్ శర్మ చాలా వెయిట్ తగ్గాడు. దానికి కారణం డిసిప్లెయిన్ డైటింగే. ప్రస్తుతం టీమ్‌లోకి పునరాగమనం చేసేందుకు కసరత్తులు చేస్తున్నాడు రోహిత్. ప్రస్తుతం సూప్స్, వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. ఆలూ పరోటా అంటే ఇష్టమట. ఇప్పుడు మాత్రం ఫిట్‌నెస్ ట్రైనర్ అండర్‌లో డైట్ ఫాలో అయిపోతున్నాడు.

మహేంద్రసింగ్ ధోని
మహేంద్రసింగ్ ధోని ఫిట్‌నెస్ గురించి, డైట్ గురించి రకరకాల రూమర్స్ ఉన్నాయి. లంచ్‌లో చపాతీలు, కొద్దిగా రైస్, చికెన్, మటన్ తీసుకుంటాడు.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో ఫోరిట్జ్ అంటే డ్రైఫ్రూట్స్‌తో, నట్స్‌తో చేసిన పదార్థం, ఫ్రూట్ జ్యూస్‌లు, సీరియల్ నట్స్ తీసుకుంటాడు. డైలీ రెండు నుండి మూడు ఎగ్స్ ట్రైనింగ్ సెషన్స్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాడు.

యువరాజ్ సింగ్

వారానికి రెండు రోజులు ఎగ్స్, చికెన్, మటన్ లాంటి మాంసాహారాన్ని తీసుకుంటాడు. లంచ్‌లో ఎక్కువ పర్సంటేజి వెజిటబుల్స్‌కే ప్రాధాన్యం ఇస్తాడు. బ్రేక్ ఫాస్ట్‌గా ఫ్రూట్ జ్యూస్‌లు, సీరియల్ నట్స్ ఎక్కువగా తీసుకుంటాడు. ఒక్కసారి క్యాన్సర్‌ని జయించి మళ్లీ జట్టులోకి వచ్చాక డైట్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాడు.

క్రిస్‌గేల్

క్రిస్‌గేల్‌కి ఇండియాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. పెద్దగా డైట్ పాటించడు. ప్రతిరోజూ గేల్ పాస్తా తినాల్సిందే. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఫ్రూట్ జ్యూస్ అండ్ కోకోనట్ వాటర్ తాగుతాడు. మీల్స్‌లో మాత్రం పాస్తా ఉండాల్సిందే. దానికి కూడా బట్టర్ ఉండాల్సిందే. సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇష్టపడింది మొహమాటం లేకుండా తినేస్తాడు. తిన్నదాన్ని కరిగించేందుకు ఎక్కువసేపు జిమ్‌లో ఉంటాడట గేల్. జిమ్‌లో కూడా ఎక్కువగా వార్మమ్ మాత్రమే చేస్తాడట క్రిస్ గేల్.

Comments

comments