డెంగ్యూతో యువకుడు మృతి

షాపూర్‌నగర్: కుత్బుల్లాపూర్‌లో డెంగ్యూ మహామ్మారి పంజా విసిరింది తీవ్ర జ్వరంతో భాదపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడు చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మృతడికి డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు విషయాన్ని జిహెచ్‌ఎంసి అధికారులకు ,ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజికవర్గంలోని దుండిగల్ గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమారుడు శివశంకర్ (16) గత కొద్ది రోజులుగా జ్వరంతో భాదపడుతున్నాడు. స్థానికంగా ఉన్న సూరారం మల్లారెడ్డిలో […]

షాపూర్‌నగర్: కుత్బుల్లాపూర్‌లో డెంగ్యూ మహామ్మారి పంజా విసిరింది తీవ్ర జ్వరంతో భాదపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడు చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మృతడికి డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు విషయాన్ని జిహెచ్‌ఎంసి అధికారులకు ,ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజికవర్గంలోని దుండిగల్ గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమారుడు శివశంకర్ (16) గత కొద్ది రోజులుగా జ్వరంతో భాదపడుతున్నాడు. స్థానికంగా ఉన్న సూరారం మల్లారెడ్డిలో రెండు రోజుల క్రితం అడ్మిటైన శివశంకర్‌కు వైద్యులు పరీక్షలు చేపట్టగా అతనికి డెంగ్యూ లక్షణాలు బయట పడ్డాయని వైద్యులు తెలిపారు. చికత్స పోందుతున్న శివశంకర్ పరిస్థితి విషమించడడంతో సోమవారం ఉదయం మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. మృతదేహన్ని వారి కుటుంబ సభ్యులకు అందించిన వైద్యులు సమాచారాన్ని వైద్య శాఖ అధికారులకు, జిహెచ్‌ఎంసి ఎఎంహెచ్‌ఒకు తెలిపామని వెల్లడించారు. చేతికొచ్చిన కుమారుడు డెంగ్యూ మహమ్మారి భారిన పడి మృతి చెందాడని తెలుసుకున్న తల్లి దుండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. శివశంకర్ మృతదేహనికి దుండిగల్ గ్రామంలో అంత్యక్రియలు చేపట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

comments

Related Stories: