డిసెంబరులో విరుష్క వివాహం..?

ముంబయి: నాలుగేళ్లుగా పీక‌ల్లోతు ప్రేమలో మునిగిపోయారు క‌్రికెట్‌, బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ. త‌మ ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి విష‌యంలో వీళ్లు ప‌బ్లిగ్గా నోరు విప్ప‌క‌పోయినా.. ఇప్పుడు ఎక్క‌డికెళ్లినా చెట్టాప‌ట్టాలేసుకొని తిరుగుతూ త‌మ రిలేష‌న్‌షిప్ గురించి చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతారా అని క్రికెట్‌, సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విరుష్క పెళ్లిపై ఓ వార్త హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ డిసెంబరులో పెళ్లి పీటలెక్కనున్నారు అనేది ఈ […] The post డిసెంబరులో విరుష్క వివాహం..? appeared first on .

ముంబయి: నాలుగేళ్లుగా పీక‌ల్లోతు ప్రేమలో మునిగిపోయారు క‌్రికెట్‌, బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ. త‌మ ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి విష‌యంలో వీళ్లు ప‌బ్లిగ్గా నోరు విప్ప‌క‌పోయినా.. ఇప్పుడు ఎక్క‌డికెళ్లినా చెట్టాప‌ట్టాలేసుకొని తిరుగుతూ త‌మ రిలేష‌న్‌షిప్ గురించి చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతారా అని క్రికెట్‌, సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విరుష్క పెళ్లిపై ఓ వార్త హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ డిసెంబరులో పెళ్లి పీటలెక్కనున్నారు అనేది ఈ వార్త సారాంశం. దీనికి ఊతమిస్తూ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల డిసెంబరులో క్రికెట్‌ నుంచి విశ్రాంతి కల్పించమని ఇటీవల బిసిసిఐని కోరిన విషయం తెలిసిందే.

దీంతో పెళ్లి కోసమే కోహ్లీ విరామం అడిగాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా విరుష్క జోడి నటించిన ఓ యాడ్ విడుదలైంది. ఓ పెళ్లికి హాజరైన ఈ జంట అక్కడ జరిగే పెళ్లినాటి ప్రమాణాలకు సంబంధించి మాట్లాడుకుంటారు. నచ్చినవారిని ఒకరిని ఒకరు ఎలా చూసుకోవాలో ఈ యాడ్ ద్వారా తమ మనసులో మాటలను పంచుకున్నారు. ప్రముఖ బట్టల సంస్థ మాన్యవర్ కోసం ఈ యాడ్ లో నటించారు విరుష్క జోడి. ఇది కూడా పుకారులకు తోడవుతోంది. కానీ… దీనిపై ఇరువురు కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

The post డిసెంబరులో విరుష్క వివాహం..? appeared first on .

Related Stories: