డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి…

Two Died after Speeding bike hits divider: Shamshabad

రంగారెడ్డి: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో మృతిచెందిన విషాద సంఘటన  శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాతంరాయి వద్ద హైవేపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులు వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు కిస్మత్‌పూర్‌కు చెందిన నరేష్, బుద్వేల్‌కు చెందిన మధుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.