డివిలియర్స్ పై భారత అభిమానుల ఆగ్రహం..

ab

న్యూఢిల్లీ: తన మిస్టర్ 360 డిగ్రీ ఆటతో అలరించే సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఎబి డివిలియర్స్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత అభిమానులు డివిలియర్స్ పై మండిపడటానికి కారణం ఎబి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫొటోనే. మా దేశానికి చెందిన ఓ ప్రముఖ వైన్‌ ఇప్పుడు భారత్‌లో కూడా దొరుకుతోంది అని డివిలియర్స్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఒక ప్రముఖ వైన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు భారత త్రివర్ణ పతాకాన్ని ఉపయోగించడంతో భారతీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత మార్కెట్లోకి కొత్త వైన్ బ్రాండ్‌ను సంబంధిత సంస్థ ఇటీవల ప్రవేశపెట్టింది. ఇలాంటి ఉత్పత్తులకు ప్రచారం చేసేందుకు డివిలియర్స్ వైన్ బాటిల్‌ ఫొటోలో జాతీయ పతాకాన్ని చేర్చి అగౌరవపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివిలియర్స్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Comments

comments