డిఫెన్స్, పాఠశాల బస్సులు ఢీ: ఒకరి మృతి

న్యాల్‌కల్ ః డిఫెన్స్, పాఠశాల బస్సులు ఢీకొన్న సంఘటనలో పాఠశాల బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, డిఫెన్స్ బస్సులోని వారు క్షతగాత్రులైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… జహీరాబాద్ పట్టణంలోని మాంటెస్సరీ పాఠశాలకు చెందిన బస్సును మండలంలోని మామిడ్గి గ్రామానికి చెందిన బరూర్ శ్రీకాంత్‌రెడ్డి (25) జహీరాబాద్‌లో బస్సుకు మరమ్మత్తు పనులు చేయించుకుని మామిడ్గి గ్రామానికి వెళ్తున్నాడు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణానికి చెందిన డిఫెన్స్ […]


న్యాల్‌కల్ ః డిఫెన్స్, పాఠశాల బస్సులు ఢీకొన్న సంఘటనలో పాఠశాల బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, డిఫెన్స్ బస్సులోని వారు క్షతగాత్రులైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… జహీరాబాద్ పట్టణంలోని మాంటెస్సరీ పాఠశాలకు చెందిన బస్సును మండలంలోని మామిడ్గి గ్రామానికి చెందిన బరూర్ శ్రీకాంత్‌రెడ్డి (25) జహీరాబాద్‌లో బస్సుకు మరమ్మత్తు పనులు చేయించుకుని మామిడ్గి గ్రామానికి వెళ్తున్నాడు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణానికి చెందిన డిఫెన్స్ బస్సులో జిల్లాలోని కంది గ్రామానికి చెందిన డిఫెన్స్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు కర్ణాటకలోని బీదర్ పట్టణంలో ఓ శుభకార్యానికి హాజరై జహీరాబాద్ వైపు వస్తున్నారు. అయితే గంగ్వార్ గ్రామ శివారులో గంగ్వార్, బీదర్ రోడ్డుపై దర్గా శివారులో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో పాఠశాల బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, డిఫెన్స్ బస్సులోని వారు క్షతగాత్రులయ్యారు. విషయం తెలుసుకున్న గంగ్వార్, పరిసర గ్రామాల వారు సంఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనానికి సమాచారం అందించారు. 108 వాహానంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం  జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు హద్నూర్ ఎస్‌ఐ సుభాష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments