డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య…

జనగామ : అమ్మా నాన్నలకు భారం కాలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబంలో నెలకొన్న ఆర్ధిక ఇబ్బందులు తనకు మనస్థాపాన్ని కలింగించాయని పెర్కొంటూ ఓ డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జనగామ పట్టణంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం… దేవరుప్పుల మండలం పెద్దమడూర్ గ్రామానికి చెందిన యాకయ్యకు ఇద్దరు కొడుకులు అందులో ఒక్కడు అన్వేశ్ (22) పట్టణంలోని ఏకశిక డిగ్రీ కళాశాలలో బికాం మూడవ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గ్రామంలో కల్లుగీత కార్మికుడు.  ప్రతిరోజు తమ గ్రామం […]


జనగామ : అమ్మా నాన్నలకు భారం కాలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబంలో నెలకొన్న ఆర్ధిక ఇబ్బందులు తనకు మనస్థాపాన్ని కలింగించాయని పెర్కొంటూ ఓ డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జనగామ పట్టణంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం… దేవరుప్పుల మండలం పెద్దమడూర్ గ్రామానికి చెందిన యాకయ్యకు ఇద్దరు కొడుకులు అందులో ఒక్కడు అన్వేశ్ (22) పట్టణంలోని ఏకశిక డిగ్రీ కళాశాలలో బికాం మూడవ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గ్రామంలో కల్లుగీత కార్మికుడు.  ప్రతిరోజు తమ గ్రామం నుండి జనగామకు వచ్చి చదువుకుంటున్నాడు.

ఓ రోజు మద్యాహ్నం ఒంటిగంట సమయంలో తన స్నేహితులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు తన కుటుంబ ఆర్ధిక ఇబ్బందులో ఉందాని తనకు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడనే విషయాన్ని స్నేహితులు స్థానిక పోలీసులకు శనివారం మధ్యాహ్నం తెలియజేశారు. దీంతో అన్వేష్ కోసం స్నేహితుల సాయంతో పట్టణంలో ఎక్కడైనా ఉన్నాడనే కోణంలో సిసి కెమెరాల్లో పోలీసులు పరిశీలించిన అన్వేష్ ఆచూకి లభ్యం కాలేదు ఇంతలో ఆదివారం ఉదయం హైద్రాబాద్ రోడ్డు వైపు జిఎంఆర్ కాలనీ సమీపంలో నాగారం వ్యవసాయ పోలాల వద్ద ఓ యువకుడు మృతి చెంది ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ ఎస్ఐ పరమేశ్ ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు.

మృతుడు అన్వేష్ మోనోక్రోటోపాస్ పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు రాసుకున్న లేఖ పోలీసులకు ఘటనా స్థలంలో లభించింది. తాను అమ్మా, నాన్నలకు భారం కాలేన్నాని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు, కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని లేఖలో పేర్కోన్నాడు. ఆత్మహత్య సమాచారం కుటుంబ సభ్యులకు అందించడంతో వారు జనగామకు వచ్చి ఆత్మహత్య చేసుకున్న కుమారుని మృత దేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక జిల్లా ఆసుపత్రిలో మృతదేహనికి పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పరమేశ్ తెలిపారు.

Comments

comments

Related Stories: