డాక్టర్ల నిర్లక్ష్యం: బాలింత మృతి

Postpartum Women Died With Doctors negligence
సిద్దిపేట అర్బన్‌ః డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిన సంఘటన సిద్దిపేట మెడికల్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితుల కథకం ప్రకారం.. పట్టణానికి చెందిన మన్నెం మమత(24),ఎర్రవళ్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డితో వివాహం జరిగింది. దంపతులకు ఇంతకు ముందు ఒక బాబు పుట్టగా ఇప్పుడు రెండవ ప్రసవం కోసం ఈ నెల 5 వ తేదిన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అదే రోజు సాయంత్రం ప్రసవంలో మమత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఇలా ఉండగా నాలుగు రోజుల పాటు మమత ఆరోగ్యం బాగానే ఉన్న ఒక రోజు క్రితం మమత జ్వరంతో బాధపడినట్లు కుటుంబీకులు తెలిపారు.ఈ విషయాన్ని డాక్టర్లకు తెలిపిన డ్యూటి లో ఉన్న నర్సు ఒక్క మాత్ర ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. మరుసటి రోజు ఒక్క సారిగా మమత ఆరోగ్యం చెడిపోయిందని తీవ్రమైన తలనొప్పితో,చెమటలు కక్కుతు బాధపడిందన్నారు. ఉన్నట్లుండి అక్కడికి వచ్చిన డాక్టర్లు మమతను రాత్రి సమయంలో ఐసియు కి మార్చినట్లు తెలిపారు. ఉదయం 4.గంటల ప్రాంతంలో మమత చనిపోయిందన్న విషయం తెలుపారన్నారు. జ్వరం వచ్చిన పరిక్షించకుండా ప్రసవం అయిన తర్వాత ఎలాంటి పర్యవేక్షణ చేయకపోవడంతో మమత చనిపోయినట్లు మమత తల్లి,కుటుంబ సభ్యులు ఆరోపించారు.ఈ విషయమై ఆసుపత్రి డాక్టర్లను సప్రదించగా మమత విషయంలో డాక్టర్ల నిర్లక్ష్యం లేదని పర్మలీన్ ధ్రాంబో ఎంబాలిజమ్ వంటి సమస్యలు రోగికి అప్పటికప్పుడు వస్తాయని మమత విషయంలో కూడా అదే జరిగిందని దాంతో మమత ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు.
వివిధ పార్టీల నాయకుల ఆందోళన
విషయం తెలిసిన వివిధ పార్టీల నాయకులు బాధితుల కుటుంబ సభ్యుల తరపున ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. మమత మరణానికి కారణమైన వారిపై వెంటనే కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. పలువురు నాయకులు వెళ్లి పోలీసుల సమక్షంలో ఆసుపత్రి సుపరెండెంట్,వైద్యులతో చర్యలు జరిపిన ఫలితం రాకపోవడంతో ఆసుపత్రి ముందే ధర్నా నిర్వహించారు.
అధాకారుల హామీతో ఆందోళన విరమించిన కుటుంబ సభ్యులు
ఉదయం నుండి ఆందోళనలో ఉన్న మమత కుటుంబ సభ్యులు ఎంతకు ఆందోళన విరమించకపోవడంతో రెవెన్యూ అధికారులు అక్కడికి చెరుకొని బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం సహాయం కోరిన వారికి ఆర్డిఒ జయ చంద్రారెడ్డి వద్దకు తీసుకెళ్లడంతో మృతురాలి పిల్లలకు పై చదువులకే కాకుండా ,సియం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం కోసం ఉన్నతాధికారులకు విన్నవిస్తామని తప్పకుండా కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

Comments

comments