డాక్టరేట్ సాధించిన గిరిజన మహిళ

tribal woman who achieved a doctorate

సూర్యపేట్: కాకతీయ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం పరిశోధకురాలు, పింగిళి మహిళ డిగ్రీ కళాశాలలో అధ్యాపాకురాలుగా విధులు నిర్వహిస్తున్న పార్వతికి వృక్షశాస్త్రం సహ ఆచ్యారులు వి. కృష్ణారెడ్డి, పర్యావేక్షణలో స్టడీస్ ఆన్ మైకోటాక్సిజెనిక్ ప్రొడ్యూసింగ్ ఫంగీ అసోషియేటెడ్ విత్ ట్రైడ్ చిల్లిస్ అండ్ థేర్ మేనేజ్‌మెంట్ అనే అంశంపై పరిశోధనలు చేసి సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ లభించింది. మండల పరిధిలోని గాంధీనగర్ తండాకు చెందిన బాణావత్ పార్వతి భర్త శ్రీను లు మాట్లాడుతూ… గిరిజన మహిళలో డాక్టరేట్ సాధించిన మొదటి మహిళ అయినందున్న చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటైన మిర్చిపై తాను చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించిందన్నారు.

మిర్చి వాణిజ్య పంటగా పండుతూ.. ప్రజల అవసరాలను తీరుస్తుందన్నారు. సాదారణంగా రోజు వారిగా గ్రీన్, రెడ్ మిర్చితో పాటుగా పోడి కారం వివిధ రకాల వంటలో వాడుతుంటాము. కారంపై ఆశించే శిలీంద్రాలు అవి ఉత్పత్తి చేసే విష పదార్థాలు వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై పరిశోదనలు చేశానన్నారు. మిర్చి పోడిపై చేసిన పరిశోధనల్లో 38 ప్రజాతులకు, 54 జాతుల శిలీంద్రాలు ఆశించి కారం నాణ్యతను తగ్గించడమేగాక వినియోగదారులకు పలు ఆరోగ్య సమస్యలు కలుగజేస్తున్నట్టు గుర్తించిన్నారు. కావున మిర్చి కారం కోనుగోలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోని ఆరోగ్యాని కాపాడుకోవాలన్నారు. తన పరిశోధనకు సహకరించిన ఆచ్యారులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టరేట్ పొందిన పార్వతికి బోటని విభాగాధిపతి డాక్టర్ సురేఖ, సీనియర్ రిటైర్డు ఆచార్యులు రామిరెడ్డి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, విద్యావేత్తలు తదితరులు అభినందించారు.

Comments

comments