డబ్బులిచ్చాం అయినా అవిశ్వాసం

కథలాపూర్ ఎంపిపి అవిశ్వాసంలో ఒప్పంద పత్రాలు బట్టబయలు నాలుగు లక్షల చొప్పుల తీసుకొని నట్టేట ముంచారు ప్రజల సమక్షంలో ఎంపిటిసి నిలదీత ఎంపిపి ఉపాధ్యక్షుని ఇంటి ఎదుట ధర్నా, దిష్టిబొమ్మ దహనం మనతెలంగాణ/కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవిశ్వాస రాజకీయాలు ఊపందుకున్నాయి. ఉత్కంఠత కలిగిస్తున్నాయి. పలువురు రాజకీ య నాయకులు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను, చెల్లించిన మొత్తాలను బట్టబయలు చేస్తున్నాయి. అవిశ్వాస రాజకీయాలన్నీ డబ్బు చుట్టే పరిభ్రమిస్తున్నాయన్న దాన్ని జరుగుతున్న పరిణామాలు ధృవీకరిస్తున్నాయి. అవిశ్వాస తీ ర్మాణాలకు […]

కథలాపూర్ ఎంపిపి అవిశ్వాసంలో ఒప్పంద పత్రాలు బట్టబయలు
నాలుగు లక్షల చొప్పుల తీసుకొని నట్టేట ముంచారు
ప్రజల సమక్షంలో ఎంపిటిసి నిలదీత
ఎంపిపి ఉపాధ్యక్షుని ఇంటి ఎదుట ధర్నా, దిష్టిబొమ్మ దహనం

మనతెలంగాణ/కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవిశ్వాస రాజకీయాలు ఊపందుకున్నాయి. ఉత్కంఠత కలిగిస్తున్నాయి. పలువురు రాజకీ య నాయకులు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను, చెల్లించిన మొత్తాలను బట్టబయలు చేస్తున్నాయి. అవిశ్వాస రాజకీయాలన్నీ డబ్బు చుట్టే పరిభ్రమిస్తున్నాయన్న దాన్ని జరుగుతున్న పరిణామాలు ధృవీకరిస్తున్నాయి. అవిశ్వాస తీ ర్మాణాలకు అనుకూలంగా ఉన్న ఎంపిటిసి సభ్యులను వారి గ్రామాల్లోనే నిలదీయడం, ఇండ్ల ముందే దిష్టిబొమ్మలు దగ్థం చేయడం లాంటివి ఘటనలు సమస్య తీవ్రతకు అ ద్దం పడుతున్నాయి.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ, కథలాపూర్, మెట్‌పల్లి, ఎలిగేడు మండల పరిషత్ అ ధ్యక్షులపై అవిశ్వాసానికి ఇప్పటికే ఆయా మండలాల్లోని ఎంపిటిసి సభ్యులు సంబంధిత అధికారులకు నోటిసులు అందజేయగా మంథని ముత్తారం, గంగాధర మండలాల్లో అవిశ్వాస తీర్మానాలవైపు సభ్యులు పావులు కదుపుతున్నారు. అవిశ్వాసాలపై చర్చించేందుకు ఈ నెల 23న కథలాపూర్, 24న మెట్‌పల్లి మండల పరిషత్ సమావేశాల ఏర్పాటుకు మెట్‌పల్లి సబ్ కలెక్టర్ గౌతమ్ ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో ఆ రెండు మండల పరిషత్‌ల్లో రాజకీయాలు వేడెక్కాయి. కథలాపూర్ మండల పరిషత్ అధ్యక్ష పదవిని దక్కించుకోవడం కోసం గతంలో బిజెపి కి చెందిన ఐదుగు రు ఎంపిటిసి సభ్యులకు రూ. 4లక్షల చొప్పున చెల్లించిన విషయం, ఆ మేరకు రాసుకున్న బాండ్ పేపర్లను కాంగ్రెస్ నాయకులు బయట పెట్టడం ఇక్కడి అవిశ్వాస రాజకీయా న్ని పరాకాష్టకు చేర్చింది. ఐదేండ్ల పాటు మద్దతు ఇచ్చేందుకు రూ.4లక్షలు తీసుకుని ప్రస్తుతం అవిశ్వాసానికి మద్దతుగా క్యాంప్‌కు వెళ్లడంపై దూలూరు గ్రామంలో ఎంపిటిసి భర్త గంగాధర్‌ను కాంగ్రెస్ నేతలు నిలదీశారు. గతంలో రా సుకున్న ఒప్పందాలు ఏమిటి.. జరుగుతన్నదేమిటని ప్రజల సమక్షంలోనే ప్రశ్నించారు. అవిశ్వాస రాజకీయాలకు మ ద్దతు పలికిన సిరికొండ గ్రామానికి చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నాంపెల్లి లింబాద్రి ఇంటి ఎదుట ధర్నా చేసిన కాంగ్రెస్ నేతలు, ఆయన దిష్టిబొమ్మను దహనం చే శారు. కథలాపూర్‌లో 13మంది ఎంపిటిసి స్థానాలకు గా ను మూడు స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోగా, ఐదేసి చొప్పున స్థానాలను బిజెపి, టిఆర్‌ఎస్ గెలుచుకున్నాయి. నా లుగేళ్ల క్రితం బిజెపి మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి తోట్ల నర్సు అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు.
ఆనాడు అధ్యక్ష పదవి కోసం బిజెపి సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్ష లు, అదే పార్టీకి చెందిన వ్యక్తికి ఉపాధ్యక్ష పదవి ఒప్పందాన్ని కాంగ్రెస్ బయట పెట్టడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉండగా స్వంత పార్టీ నేతల నుండే అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కొంటున్న ఎలిగేడు మండల పరిషత్ అధ్యక్షురాలు ఖమ్మంపల్లి లక్ష్మి భర్త దుర్గయ్య కూడా డబ్బు చెల్లింపుల విషయాన్ని మీడియా సమక్షంలోనే వెల్లడించారు.గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా నర్సాపూర్,ర్యాకల్ దేవిపల్లి ఎంపిటిసి సభ్యురాలు విజయ ప్రభాకర్‌కు డ బ్బులు ఇచ్చినప్పటికీ తిరిగి డబ్బు కోసం అవిశ్వాస రాజకీయాలకు పాల్పడడం సరికాదన్నారు.
విజయ ప్రభాకర్ తో పాటు మిగిలిన ఎంపిటిసి సభ్యులకు నాలుగేళ్ళ క్రితం ముట్టజెప్పిన డబ్బు విషయాన్ని ఆయన వెల్లడించడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. అయితే శాసన సభ్యుడు, శాసన మ ండలి సభ్యుల సమక్షంలోనే రెండున్నర సంవత్సరాలు ఒకరు, రెండున్నర సంవత్సరాలు మరొకరు అ ధ్యక్ష పదవి నిర్వహించాలని ఒప్పం దం కుదిరిందని విజయ ప్రభాకర్ చెపుతున్నారు. ఇక మెట్‌పల్లి ఎం పిపి గురిజెల రాజు పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాణంపై ఈ నెల 24న చర్చ జరగనుంది. జగ్గా సాగర్ ఎంపిటిసి సభ్యురాలు డి. కమల కు అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు వీలుగా శాసనసభ్యుడే అవిశ్వాస తీర్మాణాన్ని ముందుండి నడిపించారన్న చర్చ సాగుతుంది. ఇక్కడ కూ డా అవిశ్వాస రాజకీయాల్లో డబ్బు ప్రస్తావన వచ్చినా అది సభ్యుల మధ్యే అంతర్గతంగా సాగుతున్నది. ఇక మంథని ముత్తారంలో 9 ఎంపిటిసి స్థానాలకు ఒకే ఒక్క స్థానం గెలుచుకున్న టిఆర్‌ఎస్ ఏడుగురు సభ్యులున్న కాంగ్రెస్ మద్దతుతో అధ్యక్షత పదవిని కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎంపిపి చంద్రమౌళిని పదవి నుండి తప్పించి మైదంబండ ఎంపిటిసి చెలకల లింగాభవాని ని అధ్యక్షురాలిగా, అడవి శ్రీరాంపూర్‌కు చెందిన మూగ మల్లీశ్వరీని ఉ పాధ్యక్షురాలిగా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సభ్యులు ఆమేరకు అవిశ్వాస తీర్మాణాన్ని సిద్దం చేశారు. ఇందులో భాగంగా నాగులమ్మ వద్ద విందులు, వినోదాలు జరుపుకున్నారు. మంథని శాసన సభ్యుడు పుట్ట మధు విషయం తెలుసుకుని సభ్యులతో మాట్లాడటంతో అవిశ్వాస రాజకీయం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇక అవిశ్వాసా న్ని ఎదుర్కొంటున్న వేములవాడ, అవిశ్వాసానికి ప్రయత్నాలు జరుగుతున్న గంగాధరలోనూ బేరసారాలు కొనసాగుతున్నాయని స్థానికు లే బాహటంగా వెల్లడిస్తున్నారు.

Related Stories: