డబ్బింగ్‌లో సునీల్ సినిమా

టాలీవుడ్‌లో టాప్ కమేడియన్‌గా రాణించి హీరోగా మారాడు సునీల్. హీరోగా నేడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘జోష్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వాసువర్మ హీరో సునీల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం టీం స్విట్జర్లాండ్‌లో ఓ మేజర్ షెడ్యూల్ పూర్తిచేసుకొని ఇండియా తిరిగి వచ్చింది. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు మేజర్ టాకీ పార్ట్‌ని పూర్తి చేసుకొని వచ్చారు. ప్రస్తుతం […]

టాలీవుడ్‌లో టాప్ కమేడియన్‌గా రాణించి హీరోగా మారాడు సునీల్. హీరోగా నేడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘జోష్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వాసువర్మ హీరో సునీల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం టీం స్విట్జర్లాండ్‌లో ఓ మేజర్ షెడ్యూల్ పూర్తిచేసుకొని ఇండియా తిరిగి వచ్చింది. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు మేజర్ టాకీ పార్ట్‌ని పూర్తి చేసుకొని వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాంతో ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ముందుగా సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను శబ్దాలయా స్టూడియోస్‌లో ప్రారంభించారు. త్వరలోనే సునీల్ తన పార్ట్‌కి సంబంధించిన డబ్బింగ్‌ని మొదలుపెట్టనున్నాడు. సునీల్ సరసన నిక్కీ గల్రాని, డింపుల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తనకు హీరోగా మంచి పేరు తెస్తుందని సునీల్ భావిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సునీల్… గోపి మోహన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు.

Comments

comments

Related Stories: