డబుల్ రోల్‌లో రవితేజ?

ఈమధ్య రవితేజ బాక్సాఫీస్ సక్సెస్‌ల విషయంలో కాస్త వెనుకబడిన మాట వాస్తవమే. అలా అని ఈ స్టార్ హీరోను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. సరైన సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాడు రవితేజ. ప్రస్తుతం అతనికి పలు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మొదట మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ విడుదలవుతోంది. ఈ సినిమా తర్వాత కూడా రవితేజ  మైత్రీ బ్యానర్‌లోనే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా […]

ఈమధ్య రవితేజ బాక్సాఫీస్ సక్సెస్‌ల విషయంలో కాస్త వెనుకబడిన మాట వాస్తవమే. అలా అని ఈ స్టార్ హీరోను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. సరైన సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాడు రవితేజ. ప్రస్తుతం అతనికి పలు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మొదట మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ విడుదలవుతోంది. ఈ సినిమా తర్వాత కూడా రవితేజ  మైత్రీ బ్యానర్‌లోనే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది కానీ ఆ చిత్రాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారట. అందువల్ల రవితేజ మరో సినిమాకు పచ్చ జెండా ఊపాడు. ఈ సినిమాకు విఐ ఆనంద్ దర్శకుడు అయితే ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి దీన్ని నిర్మిస్తాడు. ఇక పవన్‌కళ్యాణ్‌కు సన్నిహితుడైన ఈ నిర్మాత ఇటీవల రవితేజతో ‘నేల టికెట్’ సినిమాను నిర్మించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఆ ఫలితంతో సంబంధం లేకుండా మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్‌లో తండ్రీ కొడుకులుగా నటిస్తాడని సమాచారం. దర్శకుడు విఐ ఆనంద్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తాడట.

Related Stories: