ట్రోఫీపై కన్నేసిన కోహ్లీ సేన

మన తెలంగాణ/క్రీడావిభాగం : ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైన జట్లలో ఒకటిగా పరిగణిస్తున్న విరాట్ కోహ్లి సేన మూడో టైటిల్‌పై కన్నేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఈసారి కూడా ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా బలమైన శక్తిగా మారింది. ఇంగ్లాండ్ పరిస్థితులు కూడా కోహ్లి సేనకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో మూడోసారి కప్పును గెలిచి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతోంది. సీనియర్లు యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ తదితరులతో […]

మన తెలంగాణ/క్రీడావిభాగం : ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైన జట్లలో ఒకటిగా పరిగణిస్తున్న విరాట్ కోహ్లి సేన మూడో టైటిల్‌పై కన్నేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఈసారి కూడా ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా బలమైన శక్తిగా మారింది. ఇంగ్లాండ్ పరిస్థితులు కూడా కోహ్లి సేనకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో మూడోసారి కప్పును గెలిచి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతోంది. సీనియర్లు యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, జస్‌ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, అశ్విన్, రవీంద్ర జడేజాలతో బౌలింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. దీంతో ఇతర జట్ల కంటే భారత్‌కే ట్రోఫీని గెలిచే అవకాశాలున్నాయని మాజీ దిగ్గజాలు సైతం అభిప్రాయపడుతున్నారు.

అందరి కళ్లు కోహ్లిపైనే…
ఛాంపియన్స్ ట్రోఫీలో అందరి కళ్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లిపైనే నిలిచాయి. ఐపిఎల్‌లో పేలవమైన ఆటతో, కెప్టెన్సీతో నిరాశపరిచిన కోహ్లి మిని ప్రపంచకప్‌లో ఎలా ఆడుతాడన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పరిగణించే కోహ్లి ఛాంపియన్స్ ట్రోఫీలో చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. దీంతో ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పక పోవచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన కోహ్లికి వన్డేల్లో కళ్లు చెదిరే రికార్డు ఉంది. ఛేజింగ్‌లో అతనికి ఎదురేలేదు. విధ్వంసక బ్యాటింగ్‌తో ఎంత పెద్ద లక్ష్యానైన చిన్నదిగా మార్చడంలో కోహ్లికి దిట్టగా పేరుంది. ఈసారి కూడా అందరి దృష్టి అతనిపై కేంద్రీకృతమైంది. జట్టును ముందుండి నడిపించేం దుకు కోహ్లి సిద్ధమయ్యాడు. ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించడమే తమ ముందున్న ఏకైక లక్షమని కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. దీంతో అతన్ని అడ్డుకోవడానికి ప్రత్యర్థి జట్లు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి. రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్‌లు కూడా జట్టుకు కీలకమైన ఆటగాళ్లు. వీరిద్దరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వన్డేల్లో రోహిత్ అసాధారణ రికార్డు ఉంది. ధాటిగా ఆడడంలో అతనికి ఎవరు సాటిరారు. ఇప్పటికే వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. యువరాజ్ కూడా ఇటు బ్యాట్‌తో, అటు బంతితో చెలరేగేం దుకు సిద్ధమయ్యాడు. అజింక్య రహానె, మహేంద్ర సింగ్ ధోనీలు కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. సీనియర్‌గా ధోనీ సేవలు జట్టుకు కీల కంగా మారాయి. ఐపిఎల్‌లో అద్భుత సలహాలు, సూచనలతో కెప్టెన్‌కు అండగా నిలిచిన ధోనీ పుణెను ఫైనల్‌కు చేర్చడంలో తనవంతు పాత్ర పోషించాడు. యువ ఆటగాళ్లు కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యాలు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచే సత్తా కలిగిన వారే. దినేష్ కార్తీక్‌కు కూడా వేగంగా ఆడడంలో మంచి పేరుంది.
ఎదురులేని బౌలింగ్…
ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బలమైన బౌలింగ్ లైనప్‌తో బరిలోకి దిగుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. షమి, భువనేశ్వర్ ఉమేశ్ యాదవ్ వంటి మ్యాచ్ విన్నర్ ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో భువనే శ్వర్, బుమ్రా, ఉమేశ్‌లు అసాధారణ బౌలింగ్ విన్యాసాలను ప్రదర్శించారు. ఇంగ్లాండ్ పిచ్‌లపై మరింత చెలరేగే సత్తా వీరికుంది. డెత్ ఓవర్లలో అద్భుత యార్కర్లతో విరుచుకు పడే బుమ్రా, భువనేశ్వర్‌లు జట్టుకు ప్రధాన అస్త్రాలుగా తయారయ్యారు. హార్దిక్ పాండ్యా కూడా మెరు గైన ఫాస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడు. ఇక, ప్రపంచంలోనే అగ్రశ్రేణి స్పిన్నర్లుగా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల సేవలు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లాండ్‌పై మెరుగైన రికార్డు కలిగిన జడేజా మరోసారి చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. కీలక సమ యాల్లో వికెట్లు తీయడంలో అశ్విన్, జడేజాలకు ఎవరు సాటిరారు. ఇటు బంతి, అటు బ్యాట్‌తో చెలరేగే సత్తా కలిగిన వీరిద్దరూ తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు అండగా నిలువాలని భావిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత బలోపేతంగా ఉన్న భారత్ ముచ్చటగా మూడోసారి కప్పును గెలుచుకోవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.
తిరుగులేని రికార్డు..
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు అద్భుత రికార్డు ఉంది. ఇప్ప టివరకు భారత్ రెండు సార్లు ఈ ట్రోఫీని సాధించింది. ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే భారత్‌తో పాటు రెండు టైటిల్స్ గెలుచుకుంది. భారత్ 2002, 2015లో ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఆస్ట్రేలియా కూడా 2006, 2009లలో ఛాంపియన్‌గా నిలిచింది. మిగతా జట్టు ఏవీ కూడా రెండు సార్లు ఈ ట్రోఫీ గెలువలేక పోయాయి. భారత్ ఒక సారిరన్నరప్‌గా నిలిచింది. అంతేగాక ఒకసారి సెమీఫైనల్ వరకు దూసుకొచ్చింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు 23 మ్యాచులు ఆడిన భారత్ 15 పోటీల్లో విజయం సాధించింది. కేవలం ఆరింటిలో మాత్రమే పరాజయం పాలైంది. మరో రెండు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ జట్టు కూడా భారత్‌ల నిలకడైన విజయాలు సాధించలేదు.

Comments

comments

Related Stories: