ట్రావెల్స్ బస్సు బోల్తా: 43 మందికి గాయాలు

Orange-Travels-Bus

గద్వాల్: జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం కొండేరు స్టేజీ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరేంజ్ ట్రావెల్స్ బోల్తా పడిన ఘటనలో 43 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments