ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి

Person Died In Road Accident

రాజంపేట్: మండలంలోని శివాయిపల్లి తలమడ్ల రైల్వేస్టేషన్ ప్రాంతంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందినట్లు భిక్కనూర్ సి.ఐ. కోటేశ్వర్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తలమడ్ల రైల్వేస్టేషన్ శివాయిపల్లి మధ్యలో గిల్ల సురేందర్‌రెడ్డి వ్యవసాయ బావి వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాంధారి మండలం చద్మల్ నేరెళ్ళ తండాకు చెందిన రాథోడ్ మాన్‌సింగ్ (25) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బోల్తా పడిన ట్రాక్టర్‌ను తీయించి మృతి చెందిన వ్యక్తిని ట్రాక్టర్ క్రింద నుండి తీసినారు. ఈ మేరకు సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సి.ఐ. తెలిపారు.