ట్రాక్టర్ బోల్తా…ఒకరు మృతి

ముదిగొండ: కంప్రసర్ ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం ముదిగొండ మండల పరిధిలోని వనంవారి కిష్టాపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం వద్ద కంప్రసర్ ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరోకరికి గాయాలయ్యాయి. ఖమ్మం నగరంలోని రమణగుట్ట కాలనీకి చెందిన దుంపా కృష్ణ (25) అనే యువకుడు వల్లభి వెళ్లే ఆర్‌అండ్‌బి రోడ్డుపై కంప్రసర్ ట్రాక్టర్‌లో వెళ్తున్నాడు. […]


ముదిగొండ: కంప్రసర్ ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం ముదిగొండ మండల పరిధిలోని వనంవారి కిష్టాపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం వద్ద కంప్రసర్ ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరోకరికి గాయాలయ్యాయి. ఖమ్మం నగరంలోని రమణగుట్ట కాలనీకి చెందిన దుంపా కృష్ణ (25) అనే యువకుడు వల్లభి వెళ్లే ఆర్‌అండ్‌బి రోడ్డుపై కంప్రసర్ ట్రాక్టర్‌లో వెళ్తున్నాడు. వనంవారి కిష్టాపురం వద్ద ఎదురుగా మేకలు, వాహనాలు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి అదుపు తప్పి పక్కనే ఉన్న గుంటలో ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న కృష్ణా అక్కడికక్కడే మృతి చెందగా క్లినర్ దుంపా భద్రాద్రికి గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని హుటాహుటిన ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబికుల ఫిర్యాదు మేరకు ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: