మంచిర్యాల : చెన్నూరు మండలం సుబ్బరాంపల్లిలో మంగళవారం ఉదయం ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. పొలం పనులు చేస్తున్న మహేశ్ (22), బాబా (40)లు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మహేశ్, బాబాల మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.