ట్రయాంగిల్ లవ్ స్టోరీ

ట్రమహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు, నోయల్, పునర్నవి భూపాలం హీరోహీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తున్న చిత్రం ‘ఎందుకో ఏమో’. ఈ చిత్రం టీజర్, సాంగ్స్ విడుదలై సినిమాపై మంచి క్రేజ్‌ను ఏర్పరిచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 12న వినాయక చవితి కానుకగా విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నందు మాట్లాడుతూ “లేడీ ప్రొడ్యూసర్‌తో సినిమా చేయడం ఇదే ప్రథమం. ఎంతో అభిరుచితో ఈ […]

ట్రమహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు, నోయల్, పునర్నవి భూపాలం హీరోహీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తున్న చిత్రం ‘ఎందుకో ఏమో’. ఈ చిత్రం టీజర్, సాంగ్స్ విడుదలై సినిమాపై మంచి క్రేజ్‌ను ఏర్పరిచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 12న వినాయక చవితి కానుకగా విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నందు మాట్లాడుతూ “లేడీ ప్రొడ్యూసర్‌తో సినిమా చేయడం ఇదే ప్రథమం. ఎంతో అభిరుచితో ఈ సినిమా చేశారు. మా దర్శకుడు నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం కల్పించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్స్‌గా ఉంటాయి”అని అన్నారు. దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ “ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. ఫ్యామిలీ, యూత్‌కి నచ్చే విధంగా సినిమా ఉంటుంది. నందు, నోయల్, పునర్నవి పోటాపోటీగా నటించారు. క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. కథ, కథనాలు కొత్తగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది”అని తెలిపారు. నిర్మాత మాలతి వద్దినేని మాట్లాడుతూ “మంచి లవ్ స్టోరీతో పాటు కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈనెల 12న విడుదల చేస్తున్నాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నోయల్, పునర్నవి, ఎంజికె ప్రవీణ్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Comments

comments