టెక్కీ నిర్వాకం.. భార్యపై శాడిజం…!

అమరావతి: ఓ టెక్కీ నిర్వాకం చూస్తే నిర్ఘాంత పోవాల్సిందే. లోపం అంతా తనలో పెట్టుకుని పెళ్లైన నాటి నుంచి భార్యను తన శాడిజంతో హింసిస్తున్నాడు. తన భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అత్తారింట అడుగు పెట్టిన ఆమెకు నరకం చూపించాడు ఆ శాడిస్టు. ఆ నవ వధువుకు తొలిరేయే గుండెలు బద్దలయ్యే వార్త చెప్పాడు. తాను సంసారానికి పనికిరానని చెప్పిన అతగాడు, అంతకుముందే ఆమె నగ్న చిత్రాలు తీసి తన లోపం గురించి బయట ఎవరికైనా చెబితే వాటిని అంతర్జాలంలో పెడతానని […]

అమరావతి: ఓ టెక్కీ నిర్వాకం చూస్తే నిర్ఘాంత పోవాల్సిందే. లోపం అంతా తనలో పెట్టుకుని పెళ్లైన నాటి నుంచి భార్యను తన శాడిజంతో హింసిస్తున్నాడు. తన భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అత్తారింట అడుగు పెట్టిన ఆమెకు నరకం చూపించాడు ఆ శాడిస్టు. ఆ నవ వధువుకు తొలిరేయే గుండెలు బద్దలయ్యే వార్త చెప్పాడు. తాను సంసారానికి పనికిరానని చెప్పిన అతగాడు, అంతకుముందే ఆమె నగ్న చిత్రాలు తీసి తన లోపం గురించి బయట ఎవరికైనా చెబితే వాటిని అంతర్జాలంలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆ యువతికి తొలిరాత్రే కాలరాత్రిగా మారింది. ఏడాదిపాటు అతడిని భరించిన ఆమె, చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం… అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన టెక్కీ రాజేంద్రప్రసాద్ కు గత ఏడాది ఆగస్టులో ఓ యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో వధువు తల్లిదండ్రులు ఏకంగా రూ. 45 లక్షల కట్నంగా ఇచ్చారు. కాగా, రాజేంద్రప్రసాద్ లోపాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు ఆయన తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న యువతి బయటకు చెప్పుకోలేక కుమిలిపోయింది. అత్తమామలకు ఈ విషయాన్ని చెబితే, వారు కూడా ఆమెను బెదిరించడంతో పాటు తమ కోడలికి టిబి ఉందని అసత్య ప్రచారం చేశారు. అంతటితో ఆగని ఆ శాడిస్టు ఆమె ఫోటోలను అడ్డుపెట్టుకుని విడాకులు ఇవ్వాలంటూ వెదించడం ప్రారంభించాడు. అంతేగాక మరో పెళ్లికి కూడా సిద్ధమైనట్లు బాధితురాలు తెలిపింది. ఇలా ఏడాదిపాటు వాళ్ల శాడిజాన్ని భరించిన ఆమె, ఇక లాభం లేదని తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: