టీనేజీలో మత్తు.. బతుకు చిత్తు

దురలవాట్లకు బానిసైతే ధమనులకు తీవ్ర నష్టం టీనేజిలో ఉన్నవారు మత్తు పానీయాలతో చిత్తయినా లేదా స్మోకింగ్‌కు బాగా బానిసలయినా 17 ఏళ్ల వయస్సుకే వారి రక్త నాళాలు ధమనులు గట్టిగా పెళుసుగా మారతాయి. ధమనులు గట్టి పడడం రక్తనాళాలకు నష్టం కలిగిందనడానికి సంకేతం అని పరిశోధనలో వెల్లడయింది. గతంలో వయోవృద్ధులపై ఇదే విధంగా చేసిన పరిశోధనలో ధమనులు గట్టిపడడం గుండె జబ్బులకు, రక్త ప్రసరణ జబ్బులకు సంబంధం ఉందని గుండెపోటు లేదా పక్షవాతానికి దారితీస్తోందని బయటపడింది. ఈ […]

దురలవాట్లకు బానిసైతే ధమనులకు తీవ్ర నష్టం

టీనేజిలో ఉన్నవారు మత్తు పానీయాలతో చిత్తయినా లేదా స్మోకింగ్‌కు బాగా బానిసలయినా 17 ఏళ్ల వయస్సుకే వారి రక్త నాళాలు ధమనులు గట్టిగా పెళుసుగా మారతాయి. ధమనులు గట్టి పడడం రక్తనాళాలకు నష్టం కలిగిందనడానికి సంకేతం అని పరిశోధనలో వెల్లడయింది. గతంలో వయోవృద్ధులపై ఇదే విధంగా చేసిన పరిశోధనలో ధమనులు గట్టిపడడం గుండె జబ్బులకు, రక్త ప్రసరణ జబ్బులకు సంబంధం ఉందని గుండెపోటు లేదా పక్షవాతానికి దారితీస్తోందని బయటపడింది. ఈ అథ్యయనంలో 1266 మందిని తీసుకున్నారు. 17 ఏళ్ల వయస్సులో వారికి స్మోకింగ్ అలవాటు ఉండడం, వారి ధమనులు గట్టిపడి ఉండడాన్ని సమీక్షించారు వీరిలో 1100 మంది 17 ఏళ్ల వయస్సులోనే తాగుడుకు బానిసైనట్టు సమాచారం లభించింది. ఇదే విథంగా 13, 15, ఏళ్ల వయస్సులోనే తాగుడుకు అలవాటు పడిన 1000 మంది టీనేజి యువకుల సమాచారం అందింది. అలాగే 13 ఏళ్ల వయస్సు నుంచే స్మోకింగ్ అలవాటున్న 661 మంది సమాచారం దొరికింది. ఈ అథ్యయన ఫలితాలను పరిశీలించగా అథ్యయనంలో పాల్గొన్న వారిలో 17 ఏళ్లకే స్మోకింగ్‌కు, అలవాటు పడినవారు 23.8 శాతం మంది కాగా, ఈ లోగా మూడోవంతు మంది అంతకన్నా ఎక్కువ మంది టీనేజర్లు ఒకానొక రోజున మూడు నుంచి 9 సార్లు ఆల్కహాలు తాగారని తేలింది. 10 శాతం ఎక్కువ మంది అంతకన్నా ఎక్కువగానే తాగుతారని చెప్పారు. 17 ఏళ్ల వయస్సు వారు ఇటీవలనే స్మోకింగ్‌కు అలవాటు పడిన వారిలో ధమనులు గట్టి పడడం, కనిపించింది. జీవితంలో వంద కన్నా ఎక్కువ సిగరెట్లు తాగే వారిలో ధమనులు గట్టిపడడం కనిపించగా 20 సిగరెట్లు కన్నా తక్కువ స్మోక్ చేసేవారిలో పెద్ద సమస్యేమీ లేదు. స్మోకింగ్ కొనసాగించినా మధ్యలో మానేసినా ధమనులు గట్టిపడడంలో మార్పేమీ కనిపించడం లేదు.
-మన తెలంగాణ/ విద్యావిభాగం

Comments

comments

Related Stories: