టీచర్ల బదిలీలలో అక్రమాలు జరిగాయి….

హైదరాబాద్: ఉపాధ్యాయ, అధ్యాపకుల బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపణలు చేశారు. శనివారం ఉదయం తెలంగాణ జన సమితి కార్యాలయంలో కోదండరాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బదిలీల ప్రక్రియలో అధికారి పార్టీకి చెందిన వారు అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. అక్రమ బదిలీలకు అధికార పార్టీ నాయకులు మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. వెబ్ అప్షన్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని […]

హైదరాబాద్: ఉపాధ్యాయ, అధ్యాపకుల బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపణలు చేశారు. శనివారం ఉదయం తెలంగాణ జన సమితి కార్యాలయంలో కోదండరాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బదిలీల ప్రక్రియలో అధికారి పార్టీకి చెందిన వారు అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. అక్రమ బదిలీలకు అధికార పార్టీ నాయకులు మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. వెబ్ అప్షన్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ గందరగోళంగా ఉందన్నారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతుందని దుయ్యబట్టారు. రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లకు తెలంగాణ జన సమితి మద్దతిస్తోందన్నారు. 40 శాతంకు పైగా రైతులకు రైతు బంధు పథకం లబ్ధి చేకూరలేదని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులకు కొత్త పాస్ పుస్తకాలు రాలేదని, వచ్చినవి తప్పుల తడకగా ఉన్నాయని, పేద రైతుల పట్ల సిఎం కెసిఆర్‌కు వ్యతిరేక భావన ఉందని కోదండరాం తెలిపారు.

Related Stories: