టిడిపికి పూర్తి మద్ధతు : కనిమొళి

Full Support to TDP: Kanimozhi

చెన్నయ్ : విభజన హామీల అమలు కోసం టిడిపి ఎంపిలు చేస్తున్న పోరాటానికి డిఎంకె పూర్తి మద్ధతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపి కనిమొళి తెలిపారు. పలువురు టిడిపి ఎంపిలు సోమవారం కనిమొళిని చెన్నయ్‌లో కలిశారు. విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని వారు ఆమె దృష్టికి తెచ్చారు. పార్లమెంట్‌లో తాము ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆమె కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. టిడిపి ఎంపిలకు తోడుగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు.

Full Support to TDP: Kanimozhi