టిజెఎస్‌కు జ్యోత్స గుడ్‌బై

Jyotsna

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టిజెఎస్)లో లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీలో ప్రారంభం నుంచీ క్రియాశీలకంగా పనిచేస్తున్న రాష్ట్ర నాయకురాలు తిరునగిరి జ్యోత్స ఆదివారం రాజీనామా చేశారు. ఆమె గత కొంత కాలంగా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో మనస్తాపానికి గురయ్యారు.

పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో, ఇందుకు కారకులెవరో మీడి యా సమావేశాన్ని ఏర్పాటు చేసి సోమవారం వివరించనున్నట్లు తెలిపా రు. స్థానిక అంబర్‌పేటకు చెందిన జ్యోత్స గతంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత తెలంగాణ జన సమితిలో చేరి అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆ పార్టీలో సన్నిహితంగా ఉండే ఒకరిద్దరికి చెప్పినట్లు తెలిసింది. అయితే పార్టీని వీడడానికి, అంబర్‌పేట నుంచి టికెట్ ఆశించడానికి సంబంధం లేదని, వేరే కారణాలు ఉన్నాయని, వాటిని మీడియా సమక్షంలోనే వెల్లడిస్తానని ఆమె తెలిపారు.

Comments

comments