టిఎస్ రెడ్కో చైర్మన్‌ను అభినందించిన మందకృష్ణ మాదిగ

TSRedco is Manda krishna madiga congratulates Charman

కొల్లాపూర్‌: తెలంగాణ పునరుదత్పాదక ఇందన వనరుల వినియోగంలో కమర్షియల్ విభాగంలో విద్యుత్ ఆదా చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్టాన్ని మొదటి స్థానంలో నిలిపిన తెలంగాణ రెడ్కో తరుపున ప్రతిష్టాత్మక స్కేచ్ అవార్డు అందుకున్న తెలంగాణ రెడ్కో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎల్లేని సుధాకర్‌రావును ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ శనివారం హైదరాబాద్‌లో రెడ్కో కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇందన వనరుల వినియోగంలో దేశంలో మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపడం అభినందనీయం అన్నారు. పట్టుదలతో రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌ ఉత్పత్తి పెంచి రాష్ట్రానికి పేరు తేవడంలో సుధాకర్‌రావు పాత్ర కీలకంగా ఉందన్నారు.ఇలాంటి మరిన్ని అవార్డులు సుధాకర్‌రావు అందుకోవాలని ఆయన అకాంక్షించారు. ఇప్పటికే కెవైఎఫ్ సంస్థ ద్వారా కొల్లాపూర్ ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు చేయూతను అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారని, అంకితభావంతో పని చేస్తున్న సుధాకర్‌రావు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు.