టిఆర్‌ఎస్ సర్కారుపై రమణ మండిపాటు

హైదరాబాద్ : తెలంగాణ సర్కారుపై తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిఆర్‌ఎస్ సర్కారు విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం తెలంగాణ టిడిపి మండల స్థాయి నేతల శిక్షణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా రమణ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో టిడిపికి బలమైన క్యాడర్ ఉందని ఆయన పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి టిడిపిని బలోపేతం చేయాలని ఆయన కార్యకర్తలకు విజ్ఞప్తి […]

హైదరాబాద్ : తెలంగాణ సర్కారుపై తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిఆర్‌ఎస్ సర్కారు విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం తెలంగాణ టిడిపి మండల స్థాయి నేతల శిక్షణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా రమణ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో టిడిపికి బలమైన క్యాడర్ ఉందని ఆయన పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి టిడిపిని బలోపేతం చేయాలని ఆయన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. 36 ఏళ్లల్లో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిడిపి ముందుకు సాగిందని ఆయన చెప్పారు. పార్టీ ఇప్పటి వరకు ఎన్నో ఆట్లు పోట్లు ఎదుర్కొని ప్రజల పక్షాన పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కెసిఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తేవాలని టిడిపి కార్యకర్తలను ఆయన కోరారు.

 Ramana Comments on TRS Govt

Comments

comments

Related Stories: