టిఆర్‌ఎస్ పాలిచ్చే ఆవులాంటిది: మంత్రి పోచారం

కామారెడ్డి: టిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలిచ్చే ఆవులాంటిదైతే కాంగ్రెస్ తన్నే దున్నుపోతులాంటిదని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో కులవృత్తులు చిన్నాభిన్నం అయ్యాయని, కులవృత్తులను కాపాడే దిశగా స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు ప్రాధాన్యతనిచ్చి ప్రతిఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం జరిగిన  ప్రగతి నివేదన సభ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రైతులు […]

కామారెడ్డి: టిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలిచ్చే ఆవులాంటిదైతే కాంగ్రెస్ తన్నే దున్నుపోతులాంటిదని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో కులవృత్తులు చిన్నాభిన్నం అయ్యాయని, కులవృత్తులను కాపాడే దిశగా స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు ప్రాధాన్యతనిచ్చి ప్రతిఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం జరిగిన  ప్రగతి నివేదన సభ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రైతులు బొడ్డురాయి అయితే దానిపై అన్నిరకాల కులవృత్తులు ఆధారపడి ఉంటాయని అన్నారు. భూమి దున్నే దగ్గరి నుండి పండిన పంట దాల్చుకునే వరకు అన్ని కులాల వ్యవసాయ సంబంధ పనులలో నిమగ్నమవుతారని అన్నారు. కులవృత్తులను కాపాడడం కోసం తమ ప్రభుత్వం సబ్సిడీ పై పలురకాల పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రంలో ఇంత వరకు 50 లక్షల మందికి రైతుబందు పథకం కింద 5,778 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకు 300 మంది రైతులు చనిపోతే 240 మంది ఖాతాలోకి ఒక్కొక్కరికి 5 లక్షలు జమ చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7.50 లక్షల ఎకరాలకు ఏటా రెండు పంటలకు సాగునీరు అందిస్తామన్నారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్ దగ్గరలోని కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ 30 లక్షల మందితో నిర్వహిస్తున్నామని, సభలో గత నాలుగున్నర ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ముఖ్యమంత్రి వివరిస్తారని ఈ సభకు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.

Related Stories: