టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు కెసిఆర్ దిశానిర్దేశం

kcr meet with TRS Party Candidates

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో  టిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులతో పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ సమావేశం ముగిసింది.  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. టిఆర్‌ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆధ్వర్యంలో మెనిఫెస్టో కమిటీ త్వరలోనే పార్టీకి సంబంధించిన మెనిఫెస్టోను అందజేస్తుందని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని అభ్యర్థులకు కెసిఆర్ సూచించారు.