టిఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరికలు

మెదక్: అధికార టిఆర్‌ఎస్ పార్టీలో రోజు రోజుకు వలసలు పెరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట్ సింగిల్ విండో ఛైర్మన్ మల్లేశం బుధవారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంఎల్ఎ మదన్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు వంద మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరారు. వీరిని హోంమంత్రి నాయిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Related Stories: