మైలార్దేవుపల్లి : ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహ త్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేం ద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చోటు చేసుకుం ది. ఆదివారం ఉదయం వ్యవసాయ విశ్వ విద్యా లయం క్యాంపస్‌లో కొందరు మార్నింగ్ వాక్ చేస్తుండగా చెట్ల పక్కన ఉన్న బోరుబావి సమీపం లోని ఇనుప పైప్‌కు ఓ వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరు కొని పరిశీలించి విచారించగా మృతి చెందిన వ్యక్తి మైలార్‌దేవుపల్లికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త, డివిజన్ కార్పొరేటర్ సమీప బంధువు మహిపాల్‌రెడ్డి (40)గా గుర్తించారు. సంఘటనా స్థలిలో ఓ ద్విచక్ర వాహ నాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి బంధువులకు సమా చారం అందించి పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించి, అనంతరం మృతుడి శవాన్ని బంధువులకు అప్పగించారు. ఈ కేసును రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి కెటిఆర్‌కు సూసైడ్ నోట్ : మైలార్దేవుపల్లి డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ వర్గాల మధ్య తెరాసలో ఆధిపత్య పోరు పెరిగి ప్రజలు ఇబ్బందుల పాలవడమే కాకుండా, అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని మృతుడు మంత్రి కెటిఆర్ పేరుతో రాసిన సూసైడ్ నోట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. కార్పొరేటర్, ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చిందని నోట్లో పేర్కొన్నాడు. అంతేగాక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి తండ్రి శ్రీశైలంరెడ్డి రాజేంద్రనగర్‌లో పార్టీని పటిష్ట పరిచి డివిజన్లో గెలిపించుకున్న వ్యక్తి అని, అతనికి ఎమ్మెల్యేకు సమానమైన పదవి ఇచ్చి గౌరవించాలని సూసైడ్ నోట్లో విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబ సభ్యులు తనను క్షమించాలని, జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసు కుంటున్నానని, అవకాశం ఉంటే ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవా లని ఉత్తరంలో ప్రాధేయపడ్డాడు.
మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం : మంత్రి మహేందర్‌రెడ్డి
మహిపాల్‌రెడ్డి కుటుంబాన్ని మంత్రి పి.మహేందర్‌రెడ్డి పరామర్శించారు. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు. మహిపాల్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందించడమే కాకుండా, మృతుడి కుటుంబానికి 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Comments
comments