టిఆర్‌ఎస్‌వి నాయకుడిపై కత్తులతో దాడి…

Crime-imageసూర్యాపేట: టిఆర్‌ఎస్‌వి నాయకుడు అన్నపూర్ణపు నరేందర్‌పై శుక్రవారం కత్తులతో దాడి జరిగింది. ఈ ఘటన  జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ దాడిలో నరేందర్ వీపుపై ఏడు కత్తిపోట్లు పడ్డాయి. దాడికి పాల్పడిన వ్యక్తులు బిజిపి నాయకులుగా ప్రాథమిక సమాచారంలో వెల్లడైంది. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు.