టిఆర్‌ఎస్‌తోనే గ్రామాలాభివృద్ధి

Nagam Janardhan Reddy allegations of development

అభివృద్ధిని చూసి ఓర్వలేక నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపణలు
టిఆర్‌ఎస్ పాలనలో ప్రజలు సుబిక్షంగా ఉన్నారు
అట్టహాసంగా ప్రారంభమైన పల్లె ప్రగతి ప్రస్థానం
పల్లె ప్రగతి ప్రస్థానంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ :  టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని కని, విని ఎరుగని రీతిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతుంటే చూసి ఓర్వలేక సుదీర్గ కాలం ఎమ్మెల్యే, మంత్రిగా కొనసాగిన నాగం జనార్ధన్‌రెడ్డి ఓర్వలేక పోతున్నాడని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డిలు అన్నారు. గురువారం బిజ్నాపల్లి మండంలోని వట్టెం గ్రామంలో పల్లె, ప్రగతి ప్రస్థానం కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా వట్టెం గుట్టలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో భారీగా ద్విచక్ర వాహన ర్యాలీతో వట్టెం గ్రామానికి చేరుకున్నారు. వట్టెం గ్రామంలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ముస్లింల స్మశాన వాటికకు ప్రహరి గోడలతో పాటు అనేక అభివృద్ది పనులకు శంఖుస్థాపన నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలిలో పార్టీ జెండాను ఆవిస్మరించిన అనంతరం వారు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల పాలు అనేక మంత్రి పదవులు అనుభవించి నాగర్‌కర్నూల్ నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహించిన నాగం జనార్ధన్ రెడ్డి అభివృద్ది గురించి పట్టించుకోలేదని, తన అన్న దమ్ములు, బందువులు అనుచరులు మాత్రమే అభివృద్ది చెందితే చాలని భావించి ప్రజలను గాలికి వదిలేశారన్నారు. సాగు నీరు, త్రాగునీరు, వైద్యం, విద్యపరంగా పూర్తిగా వెనుక బడిందని వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలను కూడా నాగం తన హాయంలో షాబాద్‌కు తరలించారని ఆరోపించారు. కేసీఆర్ సారద్యంలోని ప్రభుత్వం ప్రజ ల అవసరాలను గుర్తించి వెనుక బడిన ప్రాంతాలకు ప్రాదాన్యత నిస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. సాగు నీటికి పెద్ద పీట వేశారని, ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం చివరి దశలో ఉందని, ప్రధాన చెరువులను మినీట్యాంక్ బండ్‌లుగా తీర్చి ద్దితున్నారని, ఫెన్షన్‌లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్, రైతులకు 24 గంటలు ఉచిత విద్యు త్, రైతుబందు వంటి బృహత్తర పథకాలను ఈప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. కల్వకుర్తి ఎత్తి పోతల పథకం పనులు పూర్తై రెండేళ్ళుగా చెరువులు నింపడం ద్వారా రైతుల ఎంతో సంతోష పడుతున్నారన్నారు. అదేవిదంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరందించే పాలమూరు, రంగారెడ్డి ఎత్తి పోతల పథ కం పనులు జరుగుతున్నాయన్నారు. ఏదుల రిజర్వాయర్ పనులు 90శాతం పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉనికి కోల్పోతామనే అక్కసుతో నాగం జనార్ధన్‌రెడ్డి , ఇతర కాంగ్రేస్ పార్టీ నాయకులు ప్రాజెక్టులను అడ్డు కోవాడానికి కేసులు వేశారని , రైతు వ్యతిరేక విదానాలు అవలంబిస్తున్న కాంగ్రేస్ పార్టీ నాయకులకు ప్రజలు వచ్చే ఎన్నికలలో ప్రజలు గుణ పాటం చెబుతారన్నారు. రైతు ప్రయోజనాలను కాపాడే విదంగా పాటు పడుతున్న టీఆర్‌ఎస్ పార్టీని విమర్శించడం తగదన్నారు. ఈసందర్బంగా టీఆర్‌ఎస్ పార్టీలో గ్రామానికి చెందిన సుమారు 150 మంది యువకులు, గ్రామస్తులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనువాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments