టిఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీల నేతలు

LAXMA-REDDY

మహబూబ్ నగర్ : అధికార పార్టీ టిఆర్ఎస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజాపూర్ మండల పరిధిలోని దొండపల్లికి చెందిన పలు పార్టీలకు చెందిన వంద మంది సీనియర్ నేతలు, కార్యకర్తలకు మంత్రి  గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సిఎం కెసిఆర్ చేపడుతున్నఅభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని, టిఆర్ఎస్ లో చేరిన కార్యకర్తలు అన్నారు.