టిఆర్ఎస్ తోనే ఢీ

మారిన రాజకీయ ముఖచిత్రం జిల్లాల్లో వేడెక్కుతున్న రాజకీయాలు పూర్తిగా బలహీనపడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ   మన తెలంగాణ/ఖమ్మం : ఒకప్పుడు వామపక్షాల కోట, కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలకు బలమైన జిల్లానే. ఏ ఎన్నికలైనా ఈ వామపక్షాలు, కాంగ్రెస్, టిడిపి మధ్యనే పోటీఉండేది. 2014 లోను అదే జరిగింది. ఇప్పుడుసీన్ పూర్తిగా మారిపోయింది. ఉమ్మడి జిల్లాల్లోని పది శాసనసభ నియోజకవర్గాలలోను 2 పార్లమెంట్  స్థానాలలోను, తెలంగాణరాష్ట్ర సమితితో మిగిలిన పార్టీలు పోటీపడాల్సిన పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల తరవాత […]

మారిన రాజకీయ ముఖచిత్రం
జిల్లాల్లో వేడెక్కుతున్న రాజకీయాలు
పూర్తిగా బలహీనపడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  

మన తెలంగాణ/ఖమ్మం : ఒకప్పుడు వామపక్షాల కోట, కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలకు బలమైన జిల్లానే. ఏ ఎన్నికలైనా ఈ వామపక్షాలు, కాంగ్రెస్, టిడిపి మధ్యనే పోటీఉండేది. 2014 లోను అదే జరిగింది. ఇప్పుడుసీన్ పూర్తిగా మారిపోయింది. ఉమ్మడి జిల్లాల్లోని పది శాసనసభ నియోజకవర్గాలలోను 2 పార్లమెంట్  స్థానాలలోను, తెలంగాణరాష్ట్ర సమితితో మిగిలిన పార్టీలు పోటీపడాల్సిన పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల తరవాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీను వీడి, టిఆర్‌ఎస్‌లో చేరిన తరువాత జిల్లా రాజకీయముఖచిత్రం మా రిపోయింది. ఆ తర్వాత ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వారివారిపార్టీలను వదిలి, కారెక్కడంతో టిఆర్‌ఎస్ బలమైనే రాజకీయపార్టీగా తయారైంది. 2014 ఎన్నికలలో ఒకేఒక్క శాసన సభాస్థానాన్ని గెల్చుకుని మిగిలిన స్థానాలలో డిపాజిట్ కోల్పోయిన టిఆర్‌ఎస్‌కు మారిన రాజకీయ సమీకరణాలలో 7గురు శాసనసభ్యులున్నారు. కొత్తగూడెం నుండి జల గం వెంకటరావు, కారుగుర్తపై విజయంసాధించగా పాలేరు ఉపఎన్నికలలో తుమ్మల నాగేశ్వరరావు టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా రంగంలోకి దిగి భారీ విజయాన్నందించారు. కాంగ్రెస్‌నుండి గెలిచిన అజయ్‌కుమార్, కోరం కనకయ్యలు టిఆర్‌ఎస్‌లో చేరగా, వైసిపినుండి గెలిచిన పాయం వెంకటేశ్వర్లు, బాణోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు కూడా కారెక్కారు. బాలసాని లక్ష్మినారాయణ, టిఆర్‌ఎస్ అధ్యర్ధిగానే శాసనమండలికి ఎన్నికయ్యారు. 3 స్థానాలలో విజయం సాధించిన కాంగ్రెస్‌కు ఇప్పుడే ఒక్కరు మాత్రమే మిగిలారు. వామపక్షాలకు సంభందించి సిపిఐ, టిఆర్‌ఎస్ వ్యతిరేక పార్టీలతో పొత్తులతో రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ పొత్తులు కుదరకపోయినా పోటీకి ఆపార్టీ సిద్ధమవుతోంది. సిపిఎం మాత్రం బహుజనలెఫ్ట్‌ఫ్రంట్ పేరుతో అన్ని నియోజకవర్గాలలో పోటీచేసేందుకు సిద్ధం అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి దాదాపు అన్నినియోజకవర్గాలలోను బలమైన క్యాడర్ ఉంది. ఒకట్రెండు నియోజకవర్గాలలో ముందు వరసలోనే ఉంది. వర్గపోరు ఆపార్టీకి ఇబ్బందికరంగా మారింది. గత ఎన్నికలలో ఒక్క శాసనసభా స్థానంలో గెలిచి మిగిలిన స్థానాలలో గట్టిపోటీ ఇచ్చినా టిడిపి పరిస్థితి చావుతప్పి కన్నులొట్టపోయినట్లుంది. ఖమ్మం, భద్రాచలం, అశ్వారావుపేటలలో గెలుపు అంచులదాకా వచ్చింది. ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని తృటిలో కోల్పోయింది. ఇప్పుడు టిడిపిలో మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, తుళ్లూరి బ్రహ్మ య్య,కోనేరు సత్యనారాయణ (చిన్ని), మెచ్చా నాగేశ్వరరావులాంటి నేతలున్నా వారు కాంగ్రెస్‌లోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే ఆ పార్టీ దుకాణం ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోంది. 3 శాసనసభా స్థానాలతోపాటు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఇపుడు పూర్తిగా బలహీనపడింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా టిఆర్‌ఎస్‌లో చేరడంతో దాదాపు ఆపార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒకరిద్దరు మిగిలినా ఆ పార్టీ ఎన్నికలలో ప్రభావం చూపే పరిస్థితిలేదు. అనేక దశాబ్దాల ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో 2019 ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. వామపక్ష భావజాలం కలిగి చైతన్య రాజకీయాలకు పెట్టింది పేరైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారి ఒక ప్రాంతీయపార్టీఅయిన టిఆర్‌ఎస్‌తో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఢీకొనబోతున్నాయి. వివిధ పార్టీలనుండి చేరిన నేతలమధ్య సమన్వయం ఉంటే టిఆర్‌ఎస్‌కే అగ్రస్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Related Stories: