టాస్క్‌ఫోర్స్ దాడుల్లో గుడుంబా పట్టివేత

రెబ్బెన: రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలేటి టౌన్‌ షిప్ భగత్ సింగ్ నగర్‌లో గుడుంబా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు… గురువారం టాస్క్‌ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు నేతృత్వంలోనే టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్, సునీతలు దాడులు నిర్వహించి గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిన గుర్కా లక్ష్మి ఇంట్లో 25 లీటర్లు, ఒర్సుసాయి ఇంట్లో 2 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులను విచారించగా కైరీగూడకు చెందిన బాపురావు అనే వ్యక్తి […]


రెబ్బెన: రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలేటి టౌన్‌ షిప్ భగత్ సింగ్ నగర్‌లో గుడుంబా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు… గురువారం టాస్క్‌ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు నేతృత్వంలోనే టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్, సునీతలు దాడులు నిర్వహించి గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిన గుర్కా లక్ష్మి ఇంట్లో 25 లీటర్లు, ఒర్సుసాయి ఇంట్లో 2 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులను విచారించగా కైరీగూడకు చెందిన బాపురావు అనే వ్యక్తి సరఫరా చేశారని తెలిపినట్టు పేర్కొన్నారు. గుడుంబాను స్వాధీనం చేసుకొని, తగు చర్యల కోసం రెబ్బెన పోలీసులకు అప్పగించారు.