టాయిలెట్ పై ‘కెబిసి’ పోస్టర్ ట్విస్ట్…!

ముంబయి: ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పాపులర్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ పదో సీజన్ మంచి టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షో నిర్వాహకులు ప్రతిసారి కొత్త ట్యాగ్ లైన్ తో వస్తారు. ఈసారి  ‘కబ్ తక్ రోకోగె?’(ఎంతసేపు ఆపుకుంటారు?) అనే ట్యాగ్ ఇచ్చారు. నిజానికి ఈ షో రూపకర్తలు చెప్పిన ప్రకారం ఈ ట్యాగ్ కు అర్థం ప్రతీ వ్యక్తి తనలోని ప్రతిభను […]

ముంబయి: ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పాపులర్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ పదో సీజన్ మంచి టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షో నిర్వాహకులు ప్రతిసారి కొత్త ట్యాగ్ లైన్ తో వస్తారు. ఈసారి  ‘కబ్ తక్ రోకోగె?’(ఎంతసేపు ఆపుకుంటారు?) అనే ట్యాగ్ ఇచ్చారు. నిజానికి ఈ షో రూపకర్తలు చెప్పిన ప్రకారం ఈ ట్యాగ్ కు అర్థం ప్రతీ వ్యక్తి తనలోని ప్రతిభను అణచిపెట్టుకోకూడదు. కానీ, ఇంతటి మంచి థీమ్ తో వచ్చిన షో పోస్టర్ ను ఒక పబ్లిక్ టాయిలెట్‌పైన అతికించడంతో దీని అర్థం పూర్తిగా మారిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.

Related Stories: