టన్నుల కొద్దీ ధన్యవాదాలు

Thanks to KTR in Twitter for peoples Successful program

లక్షలాదిగా తరలివచ్చి ప్రగతి నివేదన సభను సూపర్ సక్సెస్ చేసినందుకు ప్రజలకు ట్విట్టర్‌లో కెటిఆర్ కృతజ్ఞతలు
‘చీమలదండులా వచ్చారు, మా ప్రభుత్వంపై విశ్వాసం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ 

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రగతి నివేద న’ సభకు లక్షలాదిగా తరలివచ్చిన రాష్ట్ర ప్రజానికానికి టన్నుల కొద్దీ ధన్యవాదాలు అంటూ మంత్రి కెటిఆర్ సోమవారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్న ర సంవత్సరాలలో సాధించిన ప్రగతిని ప్రజలు మరోసారి ప్రత్యక్షంగా వినేందుకు, సిఎం కెసిఆర్‌కు సంపూర్ణ మద్దతు తెలిపేందుకు గ్రామగ్రామాల నుంచి చీమలదండులా తరలివచ్చిన అశేష జనవాహినికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు కెటిఆర్ వ్యాఖ్యానించారు. సభ ను విజయవంతం చేయడానికి కొద్ది రోజులు గా రాత్రింబవళ్ళు కృషి చేసిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సహకరించిన స్థాని క ప్రజలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

చకచకా స్వచ్ఛ పనులు
భారీ బహిరంగ సభ కారణంగా కొంగరకలాన్ ప్రాంతంలో ఎలాంటి చెత్తా, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుతామని రాష్ట్రం హైకోర్టుకు విన్నవించిన విధంగానే సోమవారం ఉదయం నుంచే పారిశుద్ధ పనులు టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎ్తతున జరుగుతున్నట్లు కెటిఆర్ పేర్కొన్నారు. పెద్దసంఖ్యలో స్వీపింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి సభ, పరిసర ప్రాం తాల్లో ఎలాంటి వ్యర్థ పదార్థాలు కనిపించకుం డా పూర్తిగా ఎత్తివేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Comments

comments