జోరు మీదున్న పత్తి

మనతెలంగాణ/కొడంగల్‌రూరల్ : ఖరీఫ్‌లో నియోజకవర్గంలోని మూడు మండలాలు(కొడంగల్,బొంరాస్‌పేట,దౌల్తాబాద్)ల్లో మొత్తం 45వేల హెక్టార్లకుపైగా వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతం కంటే ఈ సారి పత్తి పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మూడు మండలాల్లో పత్తి సాధారణ విస్తీర్ణం 6671 హెక్టార్లు కాగా,ఇప్పటికే 4091హెక్టార్లలో సాగైనట్లు నమోదైంది. ఇక ఈ ప్రాంతంలో ఎంతో పేరొందిన కంది పంట మాత్రం తగ్గుతూ వస్తుంది. 26621 హెక్టార్లలో కంది సాగును వ్యవసాయ శాఖ అంచనా […]

మనతెలంగాణ/కొడంగల్‌రూరల్ : ఖరీఫ్‌లో నియోజకవర్గంలోని మూడు మండలాలు(కొడంగల్,బొంరాస్‌పేట,దౌల్తాబాద్)ల్లో మొత్తం 45వేల హెక్టార్లకుపైగా వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతం కంటే ఈ సారి పత్తి పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మూడు మండలాల్లో పత్తి సాధారణ విస్తీర్ణం 6671 హెక్టార్లు కాగా,ఇప్పటికే 4091హెక్టార్లలో సాగైనట్లు నమోదైంది. ఇక ఈ ప్రాంతంలో ఎంతో పేరొందిన కంది పంట మాత్రం తగ్గుతూ వస్తుంది. 26621 హెక్టార్లలో కంది సాగును వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటి వరకు కేవలం 13031హెక్టార్లు మాత్రమే సాగైంది. జూన్‌లో వర్షాలు వెనకడుగు వేసినా, జూలైలో కురిసిన వానలతో పంటల విస్తీర్ణం పెరుగుతోంది. దీంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో సాగులో నిమగ్నమయ్యారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 45వేల హెక్టార్లకు పైగా వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత సంవత్సరం పత్తికి లాభాసాటి ధరతో పాటు అమ్మకాలు సులభంగా ఉండడంతో రైతులు సాగుకు మోగ్గుచూపిస్తున్నారు. పత్తి సాధారణ విస్తీర్ణం 6671హెక్టార్లు కాగా,ఇప్పటి వరకు 4091హెక్టార్లలో సాగైంది. తాజాగా కురిసిన వర్షాలు ఖరీఫ్‌లో పత్తి సాగుకు కలిసొచ్చాయనే చెప్పాలి. పత్తికి అన్ని అనుకుల పరిస్థితులు ఉండడంతో సాగు జోరందుకుంది.
తెల్లబంగారం వైపే మొగ్గు…
నియోజకవర్గంలోని మూడు మండలాల్లో రైతాంగం పత్తి వైపే మొగ్గు చూపుతోంది. ఈ ప్రాంతంలో కంది పంట అత్యధికంగా సాగు చేస్తుండగా ప్రతి ఏటా పత్తి విస్తీర్ణం పెరుగుతోంది. వీటితో పాటు మినుము,పెసర, జొన్న తదితర పంటలు సాగవుతున్నాయి. కాగా పత్తి విస్తారంగా సాగవుతుండటంతో నకిలీ విత్తనాల బెడద అదే స్థాయిలో ఉంది. ఈ సారి గుంటూరు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి భారీగా నకిలీ విత్తనాలు ఇక్కడికి చేరినట్లు సమాచారం. ఒరిజినల్ బీటీ విత్తనాల ప్యాకెట్ల మాదిరిగానే అందమైన కవర్లలో ప్యాకింగ్ చేసి నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. మార్కెట్‌లో ఒరిజినల్ బీటీ విత్తనాల ప్యాకెట్ ధర రూ.850వరకు ఉంది. నకిలీ విత్తనాలను ఒరిజినల్‌గా చూపుతూ కంపెనీ ధరకే అందజేస్తున్నామని రూ.400లకే అంటగడుతూ రైతులను మోసం చేస్తున్నారు. నకిలీ విత్తనాలను అడ్డుకోవడంతో వ్యవసాయ అధికారులుల విఫలమైనట్లు స్పష్టమౌతోంది. దీంతో నకిలీ పత్తి విత్తనాలు దళారుల నుంచి రైతులకు చేరాయి. పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్న ఆలోచనతో రైతులు ఈ విత్తన్నాలను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా మొక్కలు ఏపుగా పెరగడం తప్ప పూత,కాత లేక గత సీజన్లలో రైతులు నష్టపోయారు. జిల్లా విజిలెన్స్ అధికారులు నిర్వహించిన నామ మాత్రము దాడుల వల్ల అక్రమ వ్యాపారులు నకిలీ విత్తనాలను జోరుగా చేలామని చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏటా తగ్గుతున్న కంది సాగు…
కంది పంట సాగుకు పెట్టింది పేరు ఈ ప్రాంతం. ఈ ప్రాంత కందులకు మార్కెట్‌లో గిరాకి భలేగా ఉంటోంది. కాల క్రమేనా కంది పంట విస్తీర్ణం కాస్త దిన….దినం తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా సరైన గిట్టుబాటు ధరను ప్రభుత్వం అందించక పోవడంతో పాటు విక్రయాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పంటను విక్రయించాలంటే వారం రోజుల పాటు వ్యవపాయ మార్కెట్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పత్తి విక్రయాలకు జిన్నింగ్ మిల్లులు అందుబాటులో ఉండగా, వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధరకు రైతు ఇంటి వద్దనే కొనుగోలు చేస్తున్నారు. పంటను అమ్ముకుని పైసల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కంది రైతుదైతే దీనికి పూర్తి భిన్నంగా పత్తి రైతుదుంది. కందికి అన్ని ప్రతికూల పరిస్థితులు ఉండగా పత్తికి అనుకుల పరిస్థితులు ఉండడంతో రైతులు తెల్లబంగారానికే ఓటు వేస్తున్నారు.

Comments

comments

Related Stories: