జోరుగా.. సైకిల్ హవా

 Minority youth have joined TDP
గద్వాల న్యూటౌన్: చంద్రబాబు నాయుడు హయంలో ఆభివృద్ది జరిగిందని నేడు దుర్భగమైన పరిస్ధితి నెలకోలుతుందని టిడిపి జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు వీరుబాబు అన్నారు. శనివారం స్థానిక టిడిపి బిసి సెల్ కార్యాలయంలో వీరుబాబు సమక్షంలో మైనార్టీ యువకులు భారీగా టిడిపి పార్టీలో కండువా కప్పి పార్టీలో అహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రకాల ఆభివృద్ది కార్యాక్రమాలు చెపట్టారని కోనియాడారు. రాబోయే అసెంబ్లి ఎన్నికల సమయం సమిపిస్తుంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీని బలోపెతం చెయ్యడం కోసం ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలని విజ్ఙప్తి చెశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం తమ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిసిసెల్ ప్రధాన కార్యదర్శి బుర్దపేట శివ, ఉపాధ్యాక్షుడు వేంకటేష్, తెలుగు యువత ఉపాద్యక్షుడు పాషా , సినియర్ నాయకులు ఇస్మాయిల్, టిఎన్‌ఎస్‌ఎఫ్ సుభాన్ , అనిల్ శేట్టి, రామచంద్రి, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు