జోరుగా వానలు పంటకు ఊపిరి

In Jogapur worship the village deities

జోగాపూర్‌లో గ్రామ దేవతలకు పూజలు                                                                                                          ఎల్లారెడ్డిపేటలో కప్పతల్లి ఆటలు
పూజల ఫలితమే అంటూ వివిధ గ్రామాల్లో ఆనందం

మన తెలంగాణ/కరీంనగర్: ఆరంభంలో మురిపించి, ఆ తరువాత ముఖం చాటుచేసిన వానలు ఏ పూజలు ఫలించాయో ఏమో కాని గత రెండు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వి స్తారంగా కరుస్తుండటంతో పంటలకు ఊపిరి పోసినట్లు అయింది. ఈ సారి మృగశిర ఆరంభం నుంచే కురిసిన వర్షాలతో రైతుల ఆనందానికి ఆవధులు లేకుండాపోయింది.సకాలంలో వచ్చిన వా నలు, వాతావరణ శాఖ సూచనలు వ్యవసాయానికి యోగ్యంగా ఉ ండటంతో రైతులు వేలాది ఎకరాల్లో పత్తిపంటలు వే సి ఆతరువాత వర్షం జాడలేక ఆందోళనకు గురయ్యారు. వర్షాలు సమృద్ధిగా కు రిపించాలని కోరుతూ గ్రామదేవతలకు జలాభిషేకా లు, కప్పతల్లి ఆటలు, హోమాలు వివిధ ప్రాంతాల్లో నిర్వహించా రు.రాజన్న సి రిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్‌లో వర్షాల కోసం యు వకులు,రైతులు కలిసి గ్రామదేవతల విగ్రహాలన్నింటికి జలాభిషే కం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇదే జిల్లాలోని ఎల్లారె డ్డిపేట మండల కేంద్రంలో వర్షాలు కురవని ప్రతి సంవత్సరం కప్పతల్లి ఆటలు ఆడి స్థానికంగా ఉన్న పురాతన శివాలయంలో శివలింగానికి జలాభిషేకం చేసి, జలదిగ్భందం చేయడం అనవాయితీగా వస్తున్నది. ఈ పూజలు ఫలించి ఏమో గత రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో సమృద్దిగా వర్షాలు కురుస్తుండటంతో రైతుల ఆనందానికి ఆవదులు లేకుండాపోయింది. ఎల్లారెడ్డిపేటలో శనివారం నాడు రైతులు, పురోహితులు సమృద్దిగా వర్షాలు కురస్తుండటాన్ని పురస్కరించుకొని అక్కడి శివ, అంజనేయస్వామి అలయాల్లో పుణ్యహవచనం, నవగ్రహా పూజ, రుద్రాభిషేకం ఇతర పూజలు నిర్వహించారు. వానల కోసం చేసిన జలదిగ్బంధం నుంచి శివునికి విముక్తి కల్పించారు. ఇదిలా ఉండగా ఈనెల 5వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో వర్షపాతం అంతంత మాత్రంగానే ఉండగా రెండు రోజుల్లో కురిసిన వర్షాలు సాధారణ వర్షపాతాన్ని మించి నమోదుకావడం విశేషం. ఈ రెండు రోజుల్లో కురిసిన వర్షం కారణంగా పెద్దపల్లి జిల్లాలో 180 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతానికి మించి 214 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఈ జిల్లాలోని మొత్తం 14 మండలాల్లో ఒక సుల్తానాబాద్ మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ వర్షపాతం ఆశాజనకంగా ఉండటంతో ఇది పత్తి, వరి తదితర పంటలకు అనువైనదని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దశాబ్ధాల తరబడి కరువు ప్రాంతంగా ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లాలోనూ గత రెండు రోజులుగా వర్షాల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. దీంతో ఖరీఫ్ ఆరంభంలోనే పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులు సైతం మళ్ళీ వ్వయసాయానికి సిద్దం ఆవుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని మొత్తం 16 మండలాలకు గాను ఒక మండలాన్ని మినహాయించి మిగితా అన్ని మండలాలలోనూ వర్షపాతం ఆశాజనకంగా ఉంది. 168.0 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 215.5 మిల్లిమీటర్ల వర్షపాతం జిల్లా వ్యాప్తంగా నమోదైంది. ఒక్క శనివారం రోజే 31.3 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా అంతటా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో మునిగితేలారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సాధారణానికి మిం చి వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం మీద 967.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.