జోరుగా వరినాట్లు

రైతుబంధు పథకంతో రైతుల్లో ఆనందం వరికి రూ.200 మద్దతు ధరతో నూతనోత్సాహం మన తెలంగాణ/రేగోడ్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రైతుల అభ్యున్నతి కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనితో రైతుల కళ్లల్లో ఆనందం వెలుగు చూసింది. ఖరీఫ్ సీజన్‌లో వరినాట్ల వేగం పెంచారు. రైతుల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర రూ.200లు అదనంగా ప్రకటించడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం తూకానికి ముందే […]

రైతుబంధు పథకంతో రైతుల్లో ఆనందం
వరికి రూ.200 మద్దతు ధరతో నూతనోత్సాహం

మన తెలంగాణ/రేగోడ్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రైతుల అభ్యున్నతి కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనితో రైతుల కళ్లల్లో ఆనందం వెలుగు చూసింది. ఖరీఫ్ సీజన్‌లో వరినాట్ల వేగం పెంచారు. రైతుల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర రూ.200లు అదనంగా ప్రకటించడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం తూకానికి ముందే పెట్టుబడి సహాయం అందించడంతో విత్తనాలు కొనుగోలు చేసి దుక్కిదున్నారు. అంతేకాకుండా సకాలంలో వర్షాలు కూడా కురుస్తుండడంతో రైతుల కళ్ళల్లో మరింత ఆనందం కనిపిస్తుంది. ఓవైపు ప్రభుత్వాల సహాయం, మరోవైపు వరుణుడు కూడా సహకరించడంతో ఈ సారి పంటలకు ఢోకాలేదనే ఆశతో రైతులు ఖరీఫ్‌లో వరి నాట్లను ప్రారంభిస్తున్నారు. రేగోడ్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన రైతు నర్సప్ప మండలంలోనే మొట్ట మొదటిసారిగా ఈ సీజన్‌లో వరినాట్లను ప్రారంభించారు. రైతు నర్సప్ప మాట్లాడుతూ వరినాట్లను పెద్ద పుష్యలలో నాటు వేయడం వలన వరి ధాన్యాన్ని ఎక్కువ పండించవచ్చునని, వరికి ఎలాంటి రోగాలు, అగ్గి తెగుళ్లు, దోమపోటు వంటి రోగాల నుండి రక్షించుకోవచ్చని, వరి కోత దశలో పంటకు కొంగిక వంటి తెగుళ్లు రావని అంటున్నారు. గత మూడేళ్ళుగా మా గ్రామంలో ముందస్తుగా వరినాట్లను వేస్తున్నట్లు రైతు తెలిపారు.

Related Stories: