జోగులాంబ జిల్లాలో.. గొర్రెల గోల్‌మాల్

వాటాల కోసం కొట్టుకున్న వైనం మల్దకల్ మండలంలో రూ.కోటి భారీ అవినీతి స్థానిక నేతలే అసలు సూత్రదారులు మనతెలంగాణ/గద్వాలప్రతినిధి: కులవృత్తులను ప్రోత్సహిస్తూనే… మరోవైపు ఆర్థికంగా పరిపుష్టి చే యాలనే తలంపుతో ఎంతో ప్రతీష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందు కోసం గాను రాష్ట్ర వ్యాప్తంగా నిధులు రూ.45వేల కోట్లను కెటాయించడం జరిగింది. పథకం అమలు లో అవలంభించాల్సిన విధివిధానాలను రూపొందించి నిబంధనలను పక్కాగా పాటించాలంటూ ప్ర భుత్వం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. […]

వాటాల కోసం
కొట్టుకున్న వైనం

మల్దకల్ మండలంలో
రూ.కోటి భారీ అవినీతి

స్థానిక నేతలే
అసలు సూత్రదారులు

మనతెలంగాణ/గద్వాలప్రతినిధి: కులవృత్తులను ప్రోత్సహిస్తూనే… మరోవైపు ఆర్థికంగా పరిపుష్టి చే యాలనే తలంపుతో ఎంతో ప్రతీష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందు కోసం గాను రాష్ట్ర వ్యాప్తంగా నిధులు రూ.45వేల కోట్లను కెటాయించడం జరిగింది. పథకం అమలు లో అవలంభించాల్సిన విధివిధానాలను రూపొందించి నిబంధనలను పక్కాగా పాటించాలంటూ ప్ర భుత్వం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. గ్రామాల్లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న గొర్రెల సంఘాలకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టంగా తెలియజేసింది. అయి తే నిబంధనలు ఎంపిక విధానం తదితర అంశాలు కాగితాల వరకు బాగానే కనిపిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అమలు చేసే క్రమంలోనే వాటికి తీలోదకాలు ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. గొర్రెల పథకంలో జోగులాంబగద్వాల జిల్లాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకోగా పలు వురిపై కేసులు నమోదు కావడం జైలుకు పంపడం జరిగింది. తాజాగా మల్దకల్ మండలంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు, వాటాలు పంచుకునే క్రమంలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకు న్నట్లు తెలిసింది. గొర్రెల పథకంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై మనతెలంగాణ కథనం.

అక్రమాలకు అంతేలేదు….: జోగులాంబగద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 10,400 సంఘాలకు గొర్రెలను పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో మానోపాడు మండలంలో సర్పంచీ కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. అధేవిధంగా అయిజ, వడ్డేపల్లి, అలంపూరు, గట్టు మండలాల్లో కూడ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు సమాచారం. తాజాగా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో మొత్తం 290 సంఘాలు యూనిట్లు కోసం గొర్రెల పథకంలో నమోదు చేసుకున్నాయి. ఇందులో 140 యూనిట్లు మంజూరీ అయ్యాయి. అయితే ఇందులో కేవలం 20యూనిట్లు మాత్రమే గ్రౌండింగు కాగా, మిగిలిన యూని ట్లను అక్రమార్కులు రీసైకిల్ పద్దతిలో విక్రయించి జేబులు నింపుకున్నట్లు తెలిసింది. ఇలా మొత్తం కోటి రూపాయలకు పైనే ప్రభుత్వ ధనం పక్కదారి పట్టినట్లు తెలిసింది.
వాటాల కోసం తగువులాటా…: ఇదిలా ఉంటే రీసైకిల్ పద్దతిలో విక్రయించగా వచ్చిన అవినీతి సొమ్మును పంచుకునే క్రమంలో అక్రమార్కుల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడినట్లు సమాచారం. దీంతో విషయం కాస్తా గ్రామస్తుల దృష్టికి వెళ్లడంతో గొర్రెల పథకంలో జరిగిన అవినీతి భాగోతం వెలుగు చూసింది.

అవినీతి మత్తులో అధికారులు…: గొర్రెల పథకంలో జిల్లా వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటుంటే కట్టడి చేసి చర్యలు చేపట్టాల్సిన అధికారులు కొందరు అవినీతి పరులకు వంత పాడుతూ జేబులు నింపుకునే కార్యక్రమంలో నిమగ్నమైయ్యారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణల మీద శాఖపరమైన చర్యలు కూడ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ అవినీతికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.

అధికారి ఏమన్నారంటే…:
ఈవిషయంపై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ప్రకాష్‌ను వివరణ కోరగా విచారణ జరిపి బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ మనతెలంగాణకు వివరణ ఇచ్చారు.

Comments

comments

Related Stories: