జైనలో ఘనంగా పోచమ్మ బోనాలు

మనతెలంగాణ/ధర్మపురి: మండలంలోని జైన గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. జైనలో పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. బోనాల ఉత్సవాన్ని రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వివిద గ్రామాల నుండి జైన గ్రామానికి వచ్చిన బంధువులతో గ్రామంలో సందడి నెలకొంది. మహిళలు, యువతులు ఉదయం నుండి ఉపవాస దీక్షలతో బోనాలు వండుకుని, డప్పుల చప్పుళ్లతో, నెత్తిన బోనాలతో గ్రామంలోని పుర వీధుల మీదుగా పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. పోచమ్మ […]

మనతెలంగాణ/ధర్మపురి: మండలంలోని జైన గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. జైనలో పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. బోనాల ఉత్సవాన్ని రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వివిద గ్రామాల నుండి జైన గ్రామానికి వచ్చిన బంధువులతో గ్రామంలో సందడి నెలకొంది. మహిళలు, యువతులు ఉదయం నుండి ఉపవాస దీక్షలతో బోనాలు వండుకుని, డప్పుల చప్పుళ్లతో, నెత్తిన బోనాలతో గ్రామంలోని పుర వీధుల మీదుగా పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. పోచమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ఆలయ ప్రాంగణంలో వంటలు చేసుకుని కుటుంబ సమేతంగా అక్కడే భుజించారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు, పద్మశాలి, కుమ్మరి, మాల సంఘాల మహిళలతో పాటు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related Stories: