జేబులో పేలిన మొబైల్…!(షాకింగ్ వీడియో)

ముంబయి: రెస్టారెంట్ లో అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఓ వ్యక్తి వద్ద నుంచి పెద్ద శబ్ధం రావడంతో పాటు పొగలు వస్తున్నాయి. తీరచూస్తే అతడు తన జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి బయటకు విసరడం గమనించారు. అంతే కస్టమర్లు అందరూ ఒక్కసారిగా పరుగులు పెట్టారు. తేరుకొని చూస్తే సదరు వ్యక్తి జేబులోని స్మార్ట్ ఫోన్ పేలిపోయిందని గ్రహించారు. ముంబయిలోని బంధూప్ ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో […]

ముంబయి: రెస్టారెంట్ లో అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఓ వ్యక్తి వద్ద నుంచి పెద్ద శబ్ధం రావడంతో పాటు పొగలు వస్తున్నాయి. తీరచూస్తే అతడు తన జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి బయటకు విసరడం గమనించారు. అంతే కస్టమర్లు అందరూ ఒక్కసారిగా పరుగులు పెట్టారు. తేరుకొని చూస్తే సదరు వ్యక్తి జేబులోని స్మార్ట్ ఫోన్ పేలిపోయిందని గ్రహించారు. ముంబయిలోని బంధూప్ ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డైయ్యాయి. చొక్కా జేబులో పెట్టుకున్న మొబైల్ పేలి, రెస్టారెంట్ అంతా పొగలు వ్యాపించాయి. వ్యక్తికి  స్వల్పగాయాలు కావడంతో హాస్పిటల్ లో  చేర్పించారని సమాచారం.

Comments

comments