జెనోవాలో వంతెన కూలి 10 మంది మృతి…

ఇటలీ: జెనోవా నగరంలో ఓ వంతెన కూలి కనీసం 10 మంది మరణించారని ప్రాథమిక వార్తల ద్వారా వెల్లడైంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రాకపోకల కోసం నిర్మించిన ఈ వంతెన చాలా ఎత్తుగా ఉంటుంది. కాగా.. వంతెన సగం విరిగి కింద పడిపోవడంతో కనీసం 20 వాహనాలు వాహనాలు దగ్దమయ్యాయి. ఇది చాలా ఘోరమైన దుర్ఘటనని డజన్ల మంది చనిపోయి ఉంటారని ఇటలీ రవాణా శాఖ మంత్రి […]

ఇటలీ: జెనోవా నగరంలో ఓ వంతెన కూలి కనీసం 10 మంది మరణించారని ప్రాథమిక వార్తల ద్వారా వెల్లడైంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రాకపోకల కోసం నిర్మించిన ఈ వంతెన చాలా ఎత్తుగా ఉంటుంది. కాగా.. వంతెన సగం విరిగి కింద పడిపోవడంతో కనీసం 20 వాహనాలు వాహనాలు దగ్దమయ్యాయి. ఇది చాలా ఘోరమైన దుర్ఘటనని డజన్ల మంది చనిపోయి ఉంటారని ఇటలీ రవాణా శాఖ మంత్రి డేనిలో టోనినెల్లి తెలియజేశారు. 1960లలో నిర్మించిన ఈ వంతెన కు 2016లో మరమ్మత్తులు చేపట్టారు. వంతెన కింది నుంచి రైళ్లు నడుస్తుంటాయి. వంతెన కూలడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Comments

comments