జూబ్లీహిల్స్ లో విజయ్ దేవరకొండ సందడి

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఆదివారం సందడి చేశారు. తన అభిమానులను కలసి వారికి ప్రత్యేక అనుభూతిని కలుగ చేశారు. ఇటీవల ఉత్తమ నటుడిగా గుర్తిస్తూ లభించిన జాతీయ స్థాయి ఫీలింఫేర్ అవార్డును వేలం వేయబోతున్నట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చిన నిధులను సిఎం సహాయ నిధికి అందజేయనున్నట్టు తెలిపారు. జూబ్లి 800 పబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామాజిక సేవ కార్యక్రమాలకు అవసరమైన నిధులను […]

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఆదివారం సందడి చేశారు. తన అభిమానులను కలసి వారికి ప్రత్యేక అనుభూతిని కలుగ చేశారు. ఇటీవల ఉత్తమ నటుడిగా గుర్తిస్తూ లభించిన జాతీయ స్థాయి ఫీలింఫేర్ అవార్డును వేలం వేయబోతున్నట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చిన నిధులను సిఎం సహాయ నిధికి అందజేయనున్నట్టు తెలిపారు. జూబ్లి 800 పబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామాజిక సేవ కార్యక్రమాలకు అవసరమైన నిధులను సమీకరించేందుకు తాను రౌడీ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తానని అన్నారు. ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చిన నిధులను పలు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పారు. ఈ రౌడీ బ్రాండ్ ఉత్పత్తులను పోందేందుకుగాను ప్రత్యేక మెబైల్ ఆప్ ను అందుబాటులోకి తెస్తానని తెలియజేశారు. రౌడీ క్లబ్ పేరుతో తన అభిమానులకు అనునిత్యం టచ్‌లో ఉంటానని విజయ్ దేవరకొండ  స్పష్టం చేశారు.

Related Stories: