జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 67మందిపై కేసులు…

Drunk and Drive Checks: 67 cases registered in Jubilee Hills

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 67 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 37 ద్విచక్రవాహనాలు, 30 కార్లు స్వాధీనం చేసుకుని పోలీసులు సీజ్‌ చేశారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మందు బాబుల తీరు మాత్రం మారడం లేదు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

Comments

comments